తారక్ ను సీఎం అంటూ ఎందుకు విసిగిస్తారో..

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాడు.

Update: 2023-09-16 12:11 GMT

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పెద్దగా బ్రేకులు పడలేదు. పక్క ప్రణాళికతో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్ని పనులున్నా దేవర షూటింగ్ ను అయితే ఇప్పటివరకు పెద్దగా బ్రేకులు అయితే ఇవ్వలేదు. అయితే సైమా ఈవెంట్స్ కోసం మాత్రం కొంత గ్యాప్ ఇవ్వక తప్పలేదు. అది కూడా షూటింగ్ కు ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే జూనియర్ ఎన్టీఆర్ సైమా వేడుకల్లో పాల్గొన్నాడు. సైమా వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించిన విధానం అందరినీ ఎంతగానో ఆకర్షించింది.

జూనియర్ ఎన్టీఆర్ను చూసిన ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దుబాయ్ లో జరిగిన ఈ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుంది. RRR సినిమాకు గాను జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాడు అని ముందే తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ కూడా ఈవెంట్ కు వచ్చేందుకు ఎంతో ఆసక్తిని చూపించారు.

అయితే రెడ్ కార్పెట్ పై ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వగానే ఫ్యాన్స్ ఎంతో కోలాహలంగా కనిపించారు. జై ఎన్టీఆర్ అంటూ స్లొగన్స్ కూడా మొదలుపెట్టారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ వారికి నమస్కరిస్తూ రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ ముందుకు సాగాడు. అయితే ఇంతలోనే మరొకవైపు నుంచి 'సీఎం ఎన్టీఆర్' అంటూ మరొక స్లోగన్ వినిపించింది. దీంతో ఆ సౌండ్ మరింతగా పెరిగిపోతూ వచ్చింది.

అయితే మొదట స్టార్ట్ చేసిన వర్గంపై జూనియర్ ఎన్టీఆర్ కాస్త కోపంగా చూసాడు. ఆ ఈవెంట్లో అది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదివరకే కొన్నిసార్లు సీఎం ఎన్టీఆర్ అంటూ పలు సినిమా ఈవెంట్స్ లో కూడా ఓ వర్గం అభిమానులు స్లొగన్స్ ఇచ్చారు. అప్పుడే ఎన్టీఆర్ వారికి సైలెంట్ గానే సైలెన్స్ అంటూ సైగలు చేశాడు.

ఎన్టీఆర్ కు అలా పిలిపించుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు అని ఇప్పటికే కొన్నిసార్లు రుజువయింది. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలిటిక్స్ లోకి రావడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. ఇక ఇప్పుడు అసలే ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం దానిపై ఎన్టీఆర్ స్పందించకపోవడం వంటి విషయాలు మరింత హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ క్రమంలో సీఎం ఎన్టీఆర్ అని అరవడం మరింత కోపం తెప్పించినట్లు అర్థమవుతుంది. ఎన్టీఆర్ కి ఇష్టం లేకపోయినా ఓవర్గం ఫ్యాన్స్ మాత్రం అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావడం లేదు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News