ఆ హీరో ప్లాన్ అట్టర్ ప్లాప్ అయిందా?
బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ చాలా కాలంగా వివాదాలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే
బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ చాలా కాలంగా వివాదాలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. 2015 లో అమీర్ ఖాన్ చేసిన యాంటీ ఇండియన్ కామెంట్స్ ఎఫెక్ట్ `లాల్ సింగ్ చడ్డా` పై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో తెలిసిందే. ఏకంగా ఓపెనింగ్స్ పైనే ఆ కామెంట్ ప్రభావం చూపేలా నెటి జనులు ట్రెండ్ చేసారు. ఎప్పుడో చేసిన కామెంట్స్ కూడా ఇలా తవ్వి తీస్తారని అమీర్ ఖాన్ కూడా ఊహించలేదు. ఫలితంగా నష్టం తప్పలేదు.
అయితే ఆ సినిమా పోవడానికి అదొక్కటే కారణం కాదు. ఆ సినిమాలో విషయం కూడా లేకపోవడం ప్రధాన కారణమైతే...నెగిటివ్ ఇంపాక్ట్ అన్నది మరో కారణంగా చెప్పొచ్చు. అప్పటి నుంచి అమీర్ ఖాన్ కామ్ గా ఉన్నాడు. ఇంతవరకూ కొత్త సినిమా ప్రకటించలేదు. ప్రస్తుతం కుమారుడు జునైద్ ఖాన్ ని పరిచయం చేసే పనిలో ఉన్నారు. ఓటీటీ ప్రాజెక్ట్ `మహారాజ్`తో మూవీ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు జునైద్.
నిజానికి ఈ సినిమా గురించి పెద్దగా తెలియదు. కొడుకును లాంచ్ చేస్తున్నట్లు కూడా అమీర్ ఎక్కడా హైలైట్ చేయలేదు. దీంతో ఎలాంటి సందడి లేకుండా సైలెంట్‌గా రిలీజ్ చేయాలనుకున్న విషయం స్పష్టమవుతోంది. అయితే రిలీజ్ కి ముందే ఈ సినిమా బీటౌన్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన మహారాజ్ సినిమా పోస్టర్ ఫిలిం సర్కిల్స్‌లో హీట్ పుట్టిస్తోంది. హిందువుల మనోభావాలు కించపరిచేలా ఉందన్న విమర్శలు సినిమా ఎదుర్కోంటుంది.
అంతేకాదు బాయ్‌కాట్ మహారాజ్ అనే హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో మరోసారి అమీర్ ఖాన్ కి గట్టి షాక్ తగిలినట్లు అయింది. తాను సైలెంట్ గా ఉన్నా కొడుకుని సైతం టార్గెట్ చేసినట్లు నెట్టింట చర్చ సాగుతోంది. వ్యతిరేకత నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అన్న సందేహాలు బలంగా తెరపైకి వస్తున్నాయి. ఈనేపథ్యంలో అమీర్ పై మరో రూమర్ కూడా వినిపిస్తుంది.
తాను ఇప్పుడు సినిమాలు చేసినా ఇలా వ్యతిరేకిస్తారనే? అమీర్ సైలెంట్ గా ఉన్నాడని, అందుకే తాను సినిమాలు చేయకుండా కొడుకుని రంగంలోకి దించుతున్నాడని కొత్త డౌట్ రెయిజ్ అవుతుంది. అయినా కుమారుడు సైతం టార్గెట్ అవుతున్నాడని బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది.