'వార్ -2' నుంచి తారక్ బయటకొచ్చెదెప్పుడంటే?
ఎన్టీఆర్ పై సోలో ఎపిసోడ్స్‌తో పాటు, హృతిక్ రోషన్‌లపై కొన్ని కీలకమైన సన్నివేశాలు ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు.
హృతిక్ రోషన్- తారక్ కాంబినేషన్ లో ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'వార్-2' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. దుబాయ్,మలేషియా సహా స్వదేశంలో రెండు..మూడు షెడ్యూల్స్ పూర్తి చేసారు. తాజాగా ఇటీవల మొదలైన మరో షెడ్యూల్ కూడా పూర్తయింది. ఎన్టీఆర్ పై సోలో ఎపిసోడ్స్‌తో పాటు, హృతిక్ రోషన్‌లపై కొన్ని కీలకమైన సన్నివేశాలు ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు.
తాజాగా ఈ షెడ్యూల్ పూర్తవ్వడంతో తారక్ ముంబై నుంచి హైదరాబాద్ కు నిన్నరాత్రి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే తారక్ పోర్షన్ ని ఎట్టి పరిస్థుతుల్లో జనవరి కల్లా పూర్తి చేయాలని మేకర్స్ ని కోరుతున్నట్లు సమాచారం. సన్నివేశాల సహా పాటల షూటింగ్ కూడా పూర్తి చేసి రిలీవ్ అవ్వాలని తారక్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఫిబ్రవరి తొలి వారం నుంచి ప్రశాంత్ నీల్ చిత్రాన్ని పట్టాలెక్కించాలన్నది తారక్ ప్లాన్.
దీనిలో భాగంగా 'వార్-2' మేకర్స్ ని తారక్ తొందర పెడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జనవరి నుంచి ప్రశాంత్ నీల్ పట్టాలెక్కించాలనుకున్నాడు. కానీ తారక్ డేట్లు కుదరకపోవడంతో ఫిబ్రవరికి మారింది. దీంతో తారక్ కూడా వార్ -2 మేకర్స్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొనడం అసాధ్యమైన పని. రెండు కూడా భారీ యాక్షన్ చిత్రాలే. అలాంటి సినిమాల షూటింగ్ లో ఏకకాలంలో పాల్గొనడం ఏనడుకైనా ఇబ్బందే.
అందుకే 'దేవర' రిలీజ్ అనంతరం ఎక్కువ సమయం తీసుకోకుండా 'వార్-2' సెట్స్ కి వెళ్లడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి నిర్విరామంగా 'వార్ -2' షూటింగ్ లో పాల్గొంటున్నాడు. వార్-2 ఇదే ఏడాది రిలీజ్ కానుంది. దీనిలో భాగంగా ఆగస్టు నుంచి ప్రచారం పనులు మొదలు పెట్టాలన్నది మేకర్స్ ప్లాన్. తారక్ మళ్లీ ఆగస్టులో వార్ -2 ప్రచారం కోసం కొన్ని రోజులు కేటాయించాల్సి ఉంటుంది.