ఎన్టీఆర్.. ఎందుకీ మౌనం?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు

Update: 2024-07-14 06:20 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో దేవర మూవీ తెరకెక్కుతోంది. కొరటాల శివ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రెండేళ్ల విరామం తర్వాత దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా లెవెల్ లో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ఇమేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాలని భావిస్తున్నారు.

అందుకే కథల ఎంపికలో కూడా ఎన్టీఆర్ చాలా ఎక్కువ ఫోకస్ చేశారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏ దర్శకులు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ కథలు అయితే వింటున్నారు. కానీ సెలక్షన్ విషయంలో మాత్రం కాస్త టైం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దేవర మూవీ తర్వాత హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ గా తారక్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యింది.

యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రెడీ అవుతోంది.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 మూవీ తెరకెక్కుతోంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ సెట్స్ పైకి తీసుకొని వెళ్ళనున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఈ మూవీ పైన వర్క్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్, క్యాస్టింగ్ సెలక్షన్స్ అన్ని జరుగుతున్నట్లు సమాచారం. ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి డ్రాగన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట.

ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ చెప్పిన కథ విన్నారంట. ఈ కథ ఆయనకి నచ్చిందని వైరా ఎంటర్టైన్మెంట్స్ మూవీని నిర్మించడానికి సిద్ధమైందని ప్రచారం నడిచింది. అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. దీంతో ఇందులో వాస్తవం ఎంత అనేది క్లారిటీ లేదు.. అలాగే మరో ఇద్దరు యంగ్ దర్శకులు కూడా జూనియర్ ఎన్టీఆర్ కి కథలు చెప్పారంట.

సుధీర్ వర్మ గతంలో జూనియర్ ఎన్టీఆర్ కి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ నేరేట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే తరుణ్ భాస్కర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కి కథ చెప్పారంట. కానీ తారక్ నుంచి ఇప్పటివరకు వారికి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ యంగ్ దర్శకులతో సినిమాలు చేయడం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారంట. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ పైన ఫోకస్ పెట్టారు.

బాలీవుడ్ లో కూడా కమర్షియల్ హీరోగా నిలబడాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ దర్శకులతో కంటే సక్సెస్ ఫుల్ దర్శకులతోనే వెళ్లడం బెటర్ అనే ఆలోచనతో ఉన్నాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కెరియర్ ఆరంభంలో ఎన్టీఆర్ యంగ్ దర్శకులతోనే సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్నారు. అయితే అప్పుడు రీజనల్ వరకు ఎన్టీఆర్ మార్కెట్ పరిమితం. కానీ ఇప్పుడు యూనివర్సల్ లెవల్ లో బియాండ్ తో బౌండరీస్ కథలు చేయాలని అనుకుంటున్నారు. అందుకే యంగ్ దర్శకుల విషయంలో తారక్ ఇంకా ఒక జడ్జ్ మెంట్ కి రాలేదంట.

Tags:    

Similar News