కాజల్.. బ్యాక్ టూ బ్యాక్ డబుల్ ట్రీట్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చివరిగా భగవంత్ కేసరి మూవీలో బాలయ్యకి జోడీగా నటించింది.
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చివరిగా భగవంత్ కేసరి మూవీలో బాలయ్యకి జోడీగా నటించింది. అయితే ఆ సినిమాలో కాజల్ అగర్వాల్ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించింది. కానీ ఈ ఏడాది మాత్రం అభిమానులకి కాజల్ అగర్వాల్ ఏకంగా డబుల్ ట్రీట్ ఇవ్వబోతోంది. ఆమె లీడ్ రోల్ లో నటించిన సత్యభామ మూవీ జూన్ 7న థియేటర్స్ లోకి రాబోతోంది.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తోంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. సత్యభామ మూవీ ప్రమోషన్స్ ని కాజల్ అగర్వాల్ చాలా అగ్రెసివ్ గా చేస్తోంది. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చింది. ట్రైలర్ ని ఏకంగా బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
కాజల్ అగర్వాల్ రిక్వస్ట్ తోనే బాలయ్య, అనిల్ రావిపూడి సత్యభామ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని ఆమెకి విషెస్ చెప్పారు. ఇదిలా ఉంటే సత్యభామ మూవీ ట్రైలర్ ప్రామిసింగ్ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కూడా చేసింది. దీంతో సినిమాపై అంచనాలు నెలకొని ఉన్నాయి. సత్యభామతో సోలోగా హిట్ కొట్టాలనే టార్గెట్ తో కాజల్ అగర్వాల్ ఉంది.
సత్యభామ తర్వాత మరో మూవీ కూడా కాజల్ అగర్వాల్ నుంచి రానుంది. అది భారతీయుడు 2. ఈ చిత్రంలో జులై 12న పాన్ ఇండియా లెవల్ లో థియేటర్స్ లోకి రాబోతోంది. భారతీయుడు 2 చిత్రంలో ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
రెండు నెలల వ్యవధిలోనే కాజల్ అగర్వాల్ నుంచి రెండు చిత్రాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కచ్చితంగా కాజల్ అగర్వాల్ కెరియర్ కి ఈ చిత్రాలు ఎంతో కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉందనే మాట మూవీ సర్కిల్ లో వినిపిస్తోంది. కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వాటిలో భగవంత్ కేసరి మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. జూన్, జులైలో రిలీజ్ కాబోయే రెండు చిత్రాల తర్వాత హిందీలో ఉమ అనే మూవీతో కాజల్ అగర్వాల్ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది..