హీరోయిన్లకు హబ్బీలైతే పరిస్థితి ఇలా!
మరి భర్త పక్కనుంటే పరిస్థితి ఏంటి? ముఖ్యంగా అతగాడి పరిస్థితి ఏంటి? అంటే ఇలా ఉంటుంద న్నమాట. ఇదిగో ఈ జోడీ ఎక్కడిడో వెళ్లారు. ముందు కెమారాలున్నాయి.
హీరోయిన్లకు కెమెరా ముందు నుంచుని ఫోజులివ్వడం ఎంతో అలవాటైన పని. వృత్తిపరంగా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ అదే పని కాబట్టి! కెమెరా కనిపిస్తే ఎలా ఎస్కేప్ అవ్వాలని చూస్తారు. సెట్స్ లో కెమెరా ముందు ఎంత సేపైనా..ఎన్ని టేకుల కోసమైనా నుంచోవాలి. ఇక ఏ వేడుకకు వెళ్లినా....ఎలాంటి సందర్భంలోనైనా కెమెరా ముందు నుంచుని ఫోజులివ్వాల్సిందే. ఆ రకంగా వాళ్ల జీవితమే కెమెరా తో ముడి పడి ఉంటుంది కాబట్టి తప్పదు.
మరి అలాంటి హీరోయిన్లకు కెమెరా ఫియర్ ఉన్న భర్తలు దొరికితే ఎలా ఉంటుంది? అనడానికి ఈ సన్నివేశాన్ని ఉదాహరణగా చెప్పొచ్చేమో. కాజల్ అగర్వాల్-వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఓ బాబు కూడా ఉన్నాడు. ఇక కాజల్ కి కెమెరాకనిపిస్తే చిలక నవ్వుతూ చకచకా ఫోజులిచ్చేస్తుంది. సోలో ఉన్నప్పుడు మీ ఇష్టం ఎన్ని ఫోటోలైనా తీసుకోండి..మీ ఓపిక అనేస్తుంది.
మరి భర్త పక్కనుంటే పరిస్థితి ఏంటి? ముఖ్యంగా అతగాడి పరిస్థితి ఏంటి? అంటే ఇలా ఉంటుంద న్నమాట. ఇదిగో ఈ జోడీ ఎక్కడిడో వెళ్లారు. ముందు కెమారాలున్నాయి. కాజల్ సర్రున వాటిని చూసి ముందుకెళ్లిపోతుంది. వెనుకాలున్న గౌతమ్ కిచ్లూ వెళ్లాలా? లేదా? అని సముచాయిస్తున్నాడు. ఒక కాలు ముందుకు పడుతుంటే ..మరో కాలు వెనక్కి పడుతుంది. దీంతో భర్త ఇబ్బందిని గుర్తించిన కాజల్ రా పర్వాలేదులే? అంతా మనవాళ్లే అన్న చొరవ తీసుకుని గౌతమ్ చేయి పట్టుకుని కెమెరా ముందుకు తీసుకెళ్లింది.
అయినా అతగాడు ఇబ్బంది పడుతూనే కెమెరా ముందు నుంచున్నాడు. ఆ సమయంలో అతని ముఖంలో హవభావాలు అమాయకంగా ఉన్నట్లు గమనించ వచ్చు. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అలవాటు లేని.. మీడియా కెమెరా ముందు నుంచుని ఫోజులివ్వడం అంటే కాస్త కష్టమైన పనే. కొత్తలో ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ కూడా ఇలాగే షై ఫీలయ్యేవాడు. అయితే నిక్ కి కాస్త అనుభవం ఉంటడంతో తొందరగా అలవాటు పడ్డాడు.
https://www.youtube.com/shorts/QbGU4fwR7EY