కాజోల్‌కి అజయ్ దేవగన్ ఎలా ప్రపోజ్ చేసాడంటే?
కాజోల్ ట్వీట్‌పై స్పందిస్తూ, అజయ్ దేవగన్ ఈ సినిమా సమయంలోనే కాజోల్కు తాను ఉంగరంతో ప్రపోజ్ చేసినట్లు వెల్లడించారు
బాలీవుడ్ ఆదర్శ జంటలలో అజయ్ దేవగన్ - కాజోల్ జంట ఒకరు. ఈ సంవత్సరం ఈ అందమైన జంట 24 సంవత్సరాల వివాహవార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. హల్చుల్, ఇష్క్, దిల్ క్యా కరే, ప్యార్ తో హోనా హి థా వంటి విజయవంతమైన చిత్రాలలో కలిసి పనిచేసిన తర్వాత వారు 24 ఫిబ్రవరి 1999న వివాహం చేసుకున్నారు. కాజోల్ ఇటీవల తన 'ఇష్క్' చిత్రం 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్)లో ఒక అందమైన ఫోటోగ్రాఫ్ని షేర్ చేసారు. ఇందులో కాజోల్ -అజయ్ ద్వేగన్తో పాటు అమీర్ ఖాన్- జుహీ చావ్లా జంట కూడా ఉన్నారు.
సినిమా షూటింగ్లో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ ''ఈ ఫోటోగ్రాఫ్ మేము స్విట్జర్లాండ్‌లోని కొండలపై ఒకరోజు ట్రెక్కింగ్ ముగించిన తర్వాత తీసినది.. మేము ఎంతగా అలసిపోయి ఉన్నామో.. ఎలా ఉన్నామో మీరు చూడలేరు. సూర్యుడు ఇంత ఆలస్యంగా ఎందుకు అస్తమిస్తాడు? అనిపించింది.. మేము ఎంత అద్భుతమైన నటులమో'' అని ట్వీట్ చేసారు. #26yearsofIshq అని హ్యాష్ ట్యాగ్ ని షేర్ చేసారు.
కాజోల్ ట్వీట్‌పై స్పందిస్తూ, అజయ్ దేవగన్ ఈ సినిమా సమయంలోనే కాజోల్కు తాను ఉంగరంతో ప్రపోజ్ చేసినట్లు వెల్లడించారు. అతడు ట్వీట్ చేస్తూ ''నేను ఉంగరంతో మీకు ప్రపోజ్ చేసిన ఫోటో ఇది కాదా?'' అని అడిగాడు. ఈ జంట ఇప్పుడు ఇద్దరు అందమైన పిల్లలైన నైసా - యుగ్లకు తల్లిదండ్రులు. యుగ్ పాఠశాలలో ఉండగానే నైసా సింగపూర్‌లో ఉన్నత చదువులు పూర్తి చేస్తోంది. నైసా దేవగన్ కి సెలబ్రిటీ క్రౌడ్ లో బోలెడంత పాపులారిటీ ఉంది. త్వరలోనే కథానాయికగా ఆరంగేట్రం చేస్తుంది.