కల్కి సీక్వెల్ ఉంటుందా? ఉండదా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రెడీ అయిన కల్కి 2898 ఏడీ మూవీ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Update: 2024-06-26 12:36 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రెడీ అయిన కల్కి 2898 ఏడీ మూవీ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సినీ ప్రియులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సినిమా చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన అద్భుతమైన ప్రపంచం ఎలా ఉంటుందోనని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా సినిమా మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉండడం గ్యారెంటీ!

అయితే మరికొద్ది గంటల్లో మూవీ రిలీజ్ అవుతుందనగా.. సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? ఉండదా? లేకుంటే అంతా ఒక్కసారే చూపిస్తారా? ఇప్పుడు అంతా దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ను ఇంట్రెస్ట్ గా ఆపేసి.. రెండు పార్ట్ లో ముగిస్తున్నారు. కానీ కల్కి విషయంలో ఇప్పటి వరకు మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.

చాలా మంది మాత్రం.. కల్కికి సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని బల్లగుద్ది చెబుతున్నారు. కల్కి లాంటి పెద్ద సినిమా కథలు ఒక్క పార్ట్ లో ఎవరూ చెప్పలేరని అంటున్నారు. ముఖ్యంగా నాగ్ అశ్విన్.. ఈ సినిమాలో మూడు ప్రపంచాలను క్రియేట్ చేసినట్లు చెప్పిన విషయం తెలిసిందే. పురాణాల కాన్సెప్ట్ ను తీసుకున్నట్లు కూడా చెప్పారు. కాబట్టి ఒక్క పార్ట్ లో సినిమా అంతా క్లారిటీగా చెప్పలేరని, అందుకే సీక్వెల్ పక్కా ఉంటుందని చెబుతున్నారు నెటిజన్లు.

అయితే ఇంతకుముందు సీక్వెల్ కోసం చర్చ జరిగిన సమయంలో.. కమల్ హాసన్ తొలి భాగంలో కనిపించరని వార్తలు వచ్చాయి. మొత్తం ఆయన పార్ట్ సీక్వెల్ లోనే ఉంటుందనే టాక్ వినిపించింది. కమల్, ప్రభాస్ మధ్య యుద్ధం జరుగుతుందని ఇప్పటికే ట్రైలర్ ద్వారా లైట్ గా క్లారిటీ వచ్చింది. ఆ సీక్వెన్స్ సెకండ్ పార్ట్ లోనే ఉంటుందని చెబుతున్నారు నెటిజన్లు. ఫస్ట్ పార్ట్ లో కమల్ కాసేపు మాత్రమే కనిపిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

సినిమా అంతా అయ్యాక.. చివరలో సెకండ్ పార్ట్ కోసం మేకర్స్ చెప్పే అవకాశం ఉందని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ప్రేక్షకుల్లో ఎక్కువ మంది మాత్రం సీక్వెల్ ఉంటుందనే అంటున్నారు. మరికొన్ని గంటల్లో యూఎస్ లో ప్రీమియర్స్ పడబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 5.30 గంటలకు బెనిఫిట్ షోస్ ఉన్నాయి. దీంతో సీక్వెల్ కు సంబంధించి మరికొన్ని గంటల్లో ఒక క్లారిటీ వచ్చేయనుంది. మరి నాగ్ అశ్విన్ ఏం ప్లాన్ చేశారో వేచి చూడాలి.

Tags:    

Similar News