కల్కి.. RRR, సలార్ ను దాటేసిందిగా!
మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్కి కోసమే చర్చ నడుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులతోపాటు డార్లింగ్ ఫ్యాన్స్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన అద్భుతమైన ప్రపంచాన్ని చూసేందుకు అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్కి కోసమే చర్చ నడుస్తోంది.
అయితే కల్కి సినిమా రిలీజ్ కు ముందే.. అనేక రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇప్పటికే అన్ని చోట్ల కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. రికార్డ్ స్థాయిలో టిక్కెట్లు సేల్ అవుతున్నాయి. అమెరికాలో ఇప్పటికే కల్కి మూవీ.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.20 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్ నడుస్తోంది. ప్రీమియర్ షోస్ ద్వారా భారీ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.
బుక్ మై షో వెబ్ సైట్ అండ్ యాప్ క్రాష్ కూడా అయ్యాయి. దీంతో ఈ మూవీపై క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలకే హౌస్ ఫుల్స్ కనిపించాయి. ఇక నార్త్ లో కూడా కల్కి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతోంది. పెద్ద ఎత్తున టికెట్స్ బుక్ చేస్తున్నారు సినీ ప్రియులు. నార్త్ లో తెలుగు సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా కల్కి నిలిచిపోతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. బాలీవుడ్ లో రాజమౌళి RRR, ప్రశాంత్ నీల్ సలార్ కన్నా ఎక్కువగా కల్కికి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. సలార్ కూడా ప్రభాస్ మూవీనే కావడంతో తన రికార్డ్ తానే బద్దలు కొట్టారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో నార్త్ ఆడియన్స్ దృష్టిని కూడా కల్కి మేకర్స్ బాగా తిప్పుకున్నారని అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె, కిర్రాక్ బ్యూటీ దిశా పటానీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇది కూడా నార్త్ లో కల్కిపై మంచి హైప్ క్రియేట్ అవ్వడానికి ఒక కారణమనే చెప్పాలి. అయితే బీ టౌన్ లో కల్కి ఓపెనింగ్స్ కు తిరుగులేదు. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే.. ఇక వసూళ్ల వర్షమే. మరేం జరుగుతుందో తెలియాలంటే జూన్ 27వ తేదీ వరకు వేచి చూడాలి.