కల్కి2898ఏడీ… ఇలాంటి సునామీ ఉహించలేదే..

కల్కి 2898ఏడీ మూవీ కలెక్షన్స్ చూస్తుంటే ఈ ఏడాదిలో అతి పెద్ద హిట్ మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి

Update: 2024-07-02 04:17 GMT

కల్కి 2898ఏడీ మూవీ కలెక్షన్స్ చూస్తుంటే ఈ ఏడాదిలో అతి పెద్ద హిట్ మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ స్టార్ ఇమేజ్ తో తెలుగు , హిందీ భాషలలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతూ మూవీ దూసుకుపోతోంది. నార్త్ఇండియన్ ఆడియన్స్ అయితే కల్కి చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్ లో చిన్న చిన్న టౌన్స్ లో కూడా మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. దీనిని బట్టి కల్కి వారికి ఎంత బాగా కనెక్ట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రొడ్యూసర్ లెక్కల ప్రమారం కల్కి 2898ఏడీ నాలుగు రోజుల్లోనే 555 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒక్క నార్త్ లోనే నాలుగో రోజు 114 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే నార్త్ అమెరికాలో 11 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కల్కి క్రాస్ చేసింది. ఐదో రోజు కాస్తా స్పీడ్ తగ్గిన కలెక్షన్స్ మాత్రం 100 కోట్ల దగ్గరగా వచ్చి ఉంటాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. విజువల్ స్పెక్టక్యులర్ గా హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉందనే మాట సామాన్య పబ్లిక్ నుంచి వినిపిస్తోంది.

Read more!

ఇదిలా ఉంటే గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఇదే రీతిలో కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ మూవీ 565 కోట్ల గ్రాస్ ని నాలుగు రోజుల్లో సొంతం చేసుకుంది. షేర్ పరంగా చూసుకుంటే 317 కోట్లు వచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకి పబ్లిక్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా నాలుగు రోజుల్లోనే 557.45 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. దాంట్లో 277.81 షేర్ ఉంది.

ఈ చిత్రానికి నాలుగు రోజులు వీకెండ్ కలిసొచ్చింది. ఇప్పుడు కల్కి చిత్రాన్ని గురువారం రిలీజ్ చేయడం వలన వీకెండ్ 4 డేస్ కలిసొచ్చింది. దీంతో నాలుగు రోజుల్లో 555 కోట్ల గ్రాస్ ని కల్కి మూవీ కలెక్ట్ చేయగలిగింది. షేర్ పరంగా చూసుకుంటే 300 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ కమ్ మైథాలజీ జోనర్ లో వచ్చిన ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిందో ఈ కలెక్షన్స్ బట్టి చెప్పొచ్చు.

ఇదే ట్రెండ్ మరో వారం రోజుల పాటు కొనసాగితే 1000+ కోట్ల జాబితాలో కల్కి మూవీ చేరిపోతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీ సక్సెస్ కారణంగా వచ్చిన హైప్ కల్కి పార్ట్ 2 మీద ఎక్స్ పెక్టేషన్స్ ని అమాంతం పెంచేసింది. మరి నాగ్ అశ్విన్ పార్ట్ 2 కథని ఏ విధంగా ప్రెజెంట్ చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News

eac