కల్కి.. గ్రాఫిక్స్ కోసం గట్టిగానే..

ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ కావడంతో సరికొత్త టెక్నాలజీ, అడ్వాన్స్ మోడ్ లో ఈ ప్రపంచాన్ని నాగ్ అశ్విన్ ఊహాలోకం నుంచి చూపించబోతున్నాడు.

Update: 2024-02-19 04:17 GMT

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడీ. పాన్ వరల్డ్ మూవీగా ఏకంగా 22 ప్రపంచ భాషలలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఇండియన్ స్టార్ యాక్టర్స్ అయిన కమల్ హాసన్, అమితాబచ్చన్, దీపికా పడుకునే, దిశా పటాని మూవీలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. అలాగే గెస్ట్ అప్పీరియన్స్ పాత్రలు కూడా గట్టిగానే ఉంటాయనే ప్రచారం నడుస్తోంది.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ కూడా పక్కా ప్లానింగ్ తో అవుట్ ఫుట్ సిద్ధం చేస్తున్నారు. రెండు భాగాలుగా సిద్ధం అవుతోన్న మూవీ ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కి పంపించేశారంట. ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ కావడంతో సరికొత్త టెక్నాలజీ, అడ్వాన్స్ మోడ్ లో ఈ ప్రపంచాన్ని నాగ్ అశ్విన్ ఊహాలోకం నుంచి చూపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. అందుకే కల్కి 2898 ఏడీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బలమైన యాక్షన్ సీక్వెన్స్, అద్భుతమైన విజువల్స్ తో పాటు అంతకుమించి బలమైన ఎమోషన్స్ ని కూడా మూవీలో ఉండనున్నాయంట.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఏకంగా 5 విఎఫ్ఎక్స్ కంపెనీలో విజువల్ ఎఫెక్ట్స్ పై వర్క్ చేస్తున్నాయంట. అందులో మూడు ఇండియన్ కంపెనీలు కాగా ఒకటి న్యూజిలాండ్, ఒకటి యూఎస్ కంపెనీ అని తెలుస్తోంది. వీరందరి నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ ని రాబట్టే పనిలో నాగ్ అశ్విన్ ఉన్నారు. ఎక్కువ భాగం ఇండియాలోనే గ్రాఫిక్స్ పనులు కొనసాగుతున్నట్లు సమాచారం.

ఓ వైపు ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూనే మరో వైపు మూవీ ప్రమోషన్స్ ని కూడా తాను సృష్టించిన రైడర్ క్యారెక్టర్స్ తో నాగ్ అశ్విన్ చేయిస్తున్నాడు. ఈ రైడర్స్ పాత్రలు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేయాలని నాగ్ అశ్విన్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. మే 9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

Tags:    

Similar News