యూఎస్ లో కల్కి టార్గెట్ ఎంతంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ రేంజ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేసిన మూవీ కల్కి 2898ఏడీ

Update: 2024-05-25 04:51 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ రేంజ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేసిన మూవీ కల్కి 2898ఏడీ. సుమారు 600 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీ గా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో కల్కి సినిమా రాబోతోంది. భారతీయ ఇతిహాసాలలో ఉన్న శ్రీ మహావిష్ణు పదవ అవతారం కల్కి క్యారెక్టర్ బేస్ చేసుకుని నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు.

కచ్చితంగా ఈ మూవీ వండర్స్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ పండితులు కూడా అంచనా వేస్తున్నారు. రీసెంట్ గా బుజ్జి విత్ భైరవ గ్లింప్స్ నీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా రిలీజ్ చేసింది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని లాంటి స్టార్ యాక్టర్స్ నటించారు. ఇదిలా ఉంటే జూన్ 27న రిలీజ్ కాబోయే ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ డీల్స్ చాలా వరకు క్లోజ్ అయ్యాయి.

చాలాచోట్ల వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని అడ్వాన్స్ బేస్ లో సొంతంగానే రిలీజ్ చేస్తున్నారంట. ఇక నార్త్ అమెరికాలో మూవీ రిలీజ్ రైట్స్ ఏకంగా 50 కోట్లకు అడ్వాన్స్ బేసిస్ లో అమ్ముడయ్యాయని తెలుస్తుంది. యూఎస్ లో టాప్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన ప్రత్యంగిరా సినిమాస్, ఏఏ సినిమాస్ సంయుక్తంగా కల్కి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాయి. ఈ సినిమా యూఎస్ లో 6 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేయగలిగితే హిట్ జాబితాలోకి చేరుతుంది.

6 మిలియన్స్ అనేది మూవీ బడ్జెట్ పరంగా చూసుకుంటే పెద్ద ఫిగర్ కాదు. అయితే సినిమాకి హిట్ టాక్ వస్తే మాత్రం 6 మిలియన్ కలెక్షన్స్ చాలా ఈజీగా అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. బాహుబలి సలార్ సినిమాలతో మరి భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ కాబోయే కల్కి 2898ఏడీ ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుంది అనేది వేచి చూడాలి.

రెండు భాగాలుగా కల్కి2898ఏడీ సినిమా తెరకెక్కుతూ ఉండగా మొదటి పార్ట్ జూన్ 27న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకి వచ్చే టాక్ బట్టి కల్కి సిరీస్ లో నెక్స్ట్ పార్ట్స్ ఉంటాయని ఇండస్ట్రీ టాక్. ఇక మూవీలో తయారు చేసిన ఓ స్పెషల్ కారు కోసం ఏకంగా 7 కోట్లు ఖర్చు చేసారంట. ఈ కారున భైరవ ఈ చిత్రంలో ఉపయోగించబోతున్నాడు. అడ్వాన్స్ టెక్నాలజీతో కారుని సరికొత్తగా డిజైన్ చేసి రీసెంట్ గా ఆవిష్కరించారు.

Tags:    

Similar News