కల్కి.. స్పైడర్ లాంటి మోసం కాదిది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్న విషయం తెలిసిందే

Update: 2024-05-19 09:48 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా బిగ్ బి అమితాబ్ బచ్చన్ రోల్ అశ్వత్థామ గ్లింప్స్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమాలో ప్రభాస్ బుజ్జి కోసం ఫ్యాన్స్, సినీ ప్రియులు అంతా మాట్లాడుకుంటున్నారు.

ఆ కారు ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వూలో ఈ సినిమా కోసం చాలా వాహనాలు తయారు చేసినట్లు తెలిపారు. ఫ్యూచరిస్టిక్ మూవీ కనుక వెహికల్స్ కూడా అలాగే ఉంటాయని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ప్రభాస్ బుజ్జిని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఆ బుజ్జి ప్రోమోను మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఓ గ్యాడ్జెట్ (రోబో) ను చూపించారు మేకర్స్. మూవీ టీమ్ అందరితో మాట్లాడుతూ ఆ గ్యాడ్జెట్ కనిపిస్తుంది. కొన్నిసార్లు తిడుతుంది. చివరకు భైరవ దగ్గరకు వెళ్తుంది. అప్పుడు ఆ గ్యాడ్జెట్.. తన లైఫ్ అంతా బాడీ లేకుండా బతికేయాల్సి వస్తుందేమో అని అనగా.. టైమ్ స్టార్ అయింది పదా బుజ్జి అని అంటారు. అలా కారు దగ్గరకు వెళ్తున్న సమయంలో ప్రభాస్ ఎడమ భుజంపై ఆ రోబో ఉన్నట్లు మేకర్స్ చూపించారు.

ఇక వీడియోలో బుజ్జి బాడీని చూపించడానికి స్లో మోషన్ లో ప్రభాస్ వెళ్తుంటే.. బుజ్జి త్వరగా వెళ్ళు అని ఆ రోబో తరుముతూ ఉంటుంది. అప్పుడు ప్రభాస్.. ష్.. అంటూ నోటిపై వేలు వేసి చెబుతారు. అయితే ఆ సీన్ చూస్తుంటే మహేష్ బాబు స్పైడర్ సినిమా గుర్తొస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ లో స్పైడర్ లాంటి ఒక మెటాలిక్ వస్తువు ను డైరెక్టర్ మురుగదాస్ ఇంట్రెస్టింగ్ గా చూపించారు.

ఆ గ్లింప్స్ లో మహేష్ వెనుక నుండి పైకి ఆ మెటాలిక్ స్పైడర్ ఎక్కుతూ భుజం వరకు వచ్చి సౌండ్ చేస్తే.. మహేష్.. ష్ అంటూ నోటి మీద వేలు పెడతారు. ఇప్పుడు ప్రభాస్ కూడా సేమ్ అలాగే చేయడంతో కాపీ కొట్టారని కొందరు కామెంట్లు పెడుతున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. స్పైడర్ గ్లింప్స్ లో చూపించిన మెటాలిక్ వస్తువు.. మూవీలో లేనే లేదు. కానీ కల్కిలో మాత్రం ఆ గ్యాడ్జెట్ కచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ సీన్ విషయంలో కంపేరిజన్ అవసరం లేనట్లే.

Tags:    

Similar News