కల్కి 2898 ఏడీ… ఆరోవారంలో కూడా అదే జోరు

డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1100+ కోట్ల కలెక్షన్స్ అందుకొని ఈ ఏడాది హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది

Update: 2024-08-05 03:41 GMT

డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1100+ కోట్ల కలెక్షన్స్ అందుకొని ఈ ఏడాది హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. నాగ్ అశ్విన్ సృష్టించిన ఫ్యూచరిస్టిక్ ప్రపంచానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అందుకే సినిమాకి ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఆల్ మోస్ట్ వరల్డ్ వైడ్ గా మెజారిటీ సినీ ప్రియులు ఈ సినిమాని వీక్షించారు.

చూడని వారు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే కొంతమందికి వీకెండ్స్ లో సినిమాలకి వెళ్లే అలవాటు ఉంటుంది. అలాగే కల్కి మూవీకి తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరల్ని కూడా గణనీయంగా తగ్గించారు. 100 రూపాయిలకి సినిమా చూసే ఛాన్స్ అందించారు. దీంతో మళ్ళీ కల్కి సినిమాని చూడటానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రభావం కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపించింది. కల్కి మూవీకి శుక్రవారం 65 లక్షల షేర్ వచ్చింది. అయితే శనివారం రెట్టింపు కలెక్షన్స్ రావడం విశేషం.

ఏకంగా 1.35 కోట్ల షేర్ వరల్డ్ వైడ్ గా అందుకుంది. దీంతో కల్కి మూవీ టోటల్ షేర్ 637.95 కోట్లకి చేరింది. అందులో హిందీ వెర్షన్ నుంచి 96 లక్షల షేర్ ఉండటం విశేషం. ఆదివారం కూడా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ వీకెండ్ తర్వాత సినిమాని ఆల్ మోస్ట్ థియేటర్స్ నుంచి తీసేసే ఛాన్స్ ఉంది. హాలీవుడ్ మూవీ డెడ్ పూల్ అండ్ అండ్ వాల్వరిన్ సినిమాకి ఇండియాలో మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో కల్కి సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ 640 కోట్ల షేర్ దగ్గర క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ షేర్ అందుకున్న టాప్ 10 చిత్రాల జాబితాలో కల్కి మూవీ కూడా చేరుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. నార్త్ అమెరికాలో కూడా నాన్ బాహుబలి 2 రికార్డులని కలెక్షన్స్ పరంగా కల్కి బ్రేక్ చేసింది. హిందీలో కూడా 300+ కోట్ల కలెక్షన్స్ కి సమీపంలో ఉంది. ఇక ఓటీటీలో రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ లోకి వచ్చిన తర్వాత హాలీవుడ్ దర్శక, నిర్మాతలు కల్కి సినిమాపై ఫోకస్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.

కల్కి బ్లాక్ బస్టర్ హిట్ తో సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే పార్ట్ 2 షూటింగ్ 60% కంప్లీట్ అయ్యిందని నిర్మాత చెప్పారు. అయితే మళ్ళీ కొన్ని సీన్స్ రీషూట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ ఏడాది ఆఖరిన లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో కల్కి 2898ఏడీ పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ కావొచ్చని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News