కల్కి.. రేట్లు తగ్గిస్తే ఎంత లాభమో చూశారా..
పెద్ద సినిమాలకి టిక్కెట్ల రేట్లు పెరగడం అనేది చాలా కామన్. అయితే ఇటీవల కాలంలో కొన్ని సినిమాలకు అదే పెద్ద సమస్య గా మారింది
పెద్ద సినిమాలకి టిక్కెట్ల రేట్లు పెరగడం అనేది చాలా కామన్. అయితే ఇటీవల కాలంలో కొన్ని సినిమాలకు అదే పెద్ద సమస్య గా మారింది. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలి అంటే మధ్యతరగతి ఆడియెన్స్ ఖర్చులకు భయపడుతున్నారు. ఇక ఎంతో బాగుంటే గాని సినిమా థియేటర్ల వరకు రావడం లేదనేది వాస్తవం. కంటెంట్ సూపర్ హిట్ టాక్ అందుకుంటేనే రేట్లు పెరిగినా జనాలు పెద్దగా పట్టించుకోరు.
ఇక ఇటీవల కల్కి 2898AD సినిమా అందుకు ఉదాహరణగా నిలిచింది. మొదటి 5 రోజుల వరకు ఏపీ తెలంగాణలో కల్కి 10 కోట్ల షేర్ తక్కువ కాకుండా రాబట్టింది. ఇక 6వ రోజు నుంచి మెల్లమెల్లగా నెంబర్లు తగ్గుతూ వచ్చాయి. అయితే మళ్ళీ హఠాత్తుగా 11వ రోజు 10 కోట్ల షేర్ ను అందుకోవడం విశేషం. సెకండ్ వీకెండ్ లో చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. అందుకు కారణం సినిమా టిక్కెట్ల రేట్లు చాలా వరకు తగ్గించడమే.
సెకండ్ వీకెండ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు బాగా గిట్టుబాటు అయ్యిందని చెప్పవచ్చు. ఇక నిర్మాత అదే రేంజ్ లో రేట్లు కొనసాగించి ఉంటే ఈ స్థాయిలో నెంబర్స్ పెరిగేవి కావేమో. అలాగే నార్త్ లో కూడా సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ ఒక్కసారిగా పుంజుకున్నాయి. నార్త్ లో మొదటి రోజు 22 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకున్న కల్కి ఆ తరువాత హెచ్చు తగ్గులను చూసింది. కానీ 11వ రోజు మాత్రం మళ్ళీ 22 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం.