'కల్కి 2898 AD' విజన్‌పై మెగాస్టార్ ప్రశంస
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 AD' చిత్రం యూనిక్ థాట్ ప్రాసెస్ గురించి దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 AD' చిత్రం యూనిక్ థాట్ ప్రాసెస్ గురించి దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న పరభాషా నటులు అమితాబ్, దీపిక ఇప్పటికే నాగ్ అశ్విన్ విజన్ ని ఆకాశానికెత్తేశారు. ఇది రొటీన్ సినిమా కాదు.. చాలా విషయం ఉంది! అంటూ ఇంతకుముందు దీపిక పదుకొనే కితాబిచ్చింది. ఇందులో కొత్తదనం చూసాను అంటూ హిందీ మీడియాతో మాట్లాడింది దీపిక.
ఎపిక్ సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం ఈ ఏడాది మే9న విడుదలకు సిద్ధమవుతుండగా.. మేకర్స్ నెమ్మదిగా ప్రమోషన్స్ లో జోరు పెంచుతున్నారు. తాజాగా కల్కి 2898 AD గురించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లేటెస్ట్ అప్ డేట్ ని అందించారు. ఈ సినిమా స్థితి, తన షూటింగ్ పార్ట్ గురించి తాజా విషయం చెప్పారు.
''మళ్ళీ లేట్.. కానీ కల్కి పూర్తయ్యే సమయానికి నిన్న రాత్రి మరింత ఆలస్యం అయింది.. మే 9న విడుదలవుతోంది కాబట్టి... అందరినీ షేప్‌లో ఉంచడానికి.. మేకర్స్ వాగ్దానం మేరకు మంచి అనుభవాన్ని ప్రజలందరికీ అందించడానికి చివరి ప్రయత్నాలు'' అని అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఇటీవల అమితాబ్ కల్కి కోసం పని చేస్తున్నారని కథనాలొచ్చాయి. దీనిపై అమితాబ్ పైవిధంగా ప్రస్థావించారు. ముగింపులో డెడ్ లైన్ కోసం తాను తీవ్రంగా శ్రమిస్తున్నారని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా సాగుతోంది. ప్రభాస్- దిశా పటాని జంటపై రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం మేకర్స్ ఇటీవల ఇటలీ వెళ్లారు. కల్కి 2898 AD హిందూ పురాణాల నుండి ప్రేరణ పొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. భవిష్యత్ ప్రపంచ సాంకేతికతను ఇందులో ఆవిష్కరిస్తారు. మహాభారతం కాలం నుంచి సాగే కథనం తెరపై కనిపిస్తుంది. ఈ చిత్రం 9మే 2024న విడుదల కానుంది. ఇందులో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ తో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు.