కల్కి.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

అయితే నిర్మాత అశ్వినీదత్ మాత్రం ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారంట.

Update: 2024-03-17 05:10 GMT

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ చేస్తోన్న మూవీ కల్కి 2898ఏడీ. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. మరో వైపు పార్ట్ 1 పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మిస్తోన్నారు. మూవీలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ క్యాస్టింగ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని కలియుగాంతంలో జరిగే కథాంశంగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ కంప్లీట్ ఫిక్షనల్ ఐడియాలజీతో ఐడియాలజీతో సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. మే 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. అయితే దేశవ్యాప్తంగా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది.

ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు ఈ ఎన్నికల మూడ్ దేశంలో ఉండబోతోంది. అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. కల్కి మూవీ భారీ కాన్వాస్ పై సిద్ధం అవుతోన్న సినిమా కావడంతో మే 9న రిలీజ్ అంటే ఎలక్షన్ ఇంపాక్ట్ కచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. అందుకే రిలీజ్ డేట్ ని వాయిదా వేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు రిలీజ్ అనేది ఇంకా నిర్ణయించుకోలేదు.

నిర్మాత, బయ్యర్లు కూర్చొని రిలీజ్ డేట్ పైన చర్చిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. బయ్యర్లు జులై 5న కల్కి మూవీ రిలీజ్ చేయాలని అడుగుతున్నారంట. అయితే నిర్మాత అశ్వినీదత్ మాత్రం ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారంట. ఆగష్టులో రిలీజ్ అయితే కచ్చితంగా ఆ ఇంపాక్ట్ పుష్ప ది రూల్ మీద పడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

పుష్ప మేకర్స్ ముందే అనుకున్న డేట్ కాబట్టి అప్పుడు క్లాష్ అంటే ఒప్పుకోరు. దీనిపై ఫైనల్ ఒపీనియన్ ఇంకా రావాల్సి ఉందని తెలుస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకి సంబందించి కల్కి మూవీ బిజినెస్ డీల్స్ ఇంకా క్లోజ్ కాలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ ఆల్ మోస్ట్ డీల్స్ క్లోజ్ అయినట్లే తెలుస్తోంది. ఎన్నికల ఇంపాక్ట్ ఏ మాత్రం లేకుండా పబ్లిక్ లోకి సినిమాని బలంగా పంపించాల్సిన అవసరం ఉంది.

ఈ కారణంగానే రిలీజ్ డేట్ విషయంలో చిత్రం యూనిట్ వెనక్కి వెళ్లాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. జులై లేదా ఆగష్టులో అయితే కల్కి రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ అది మిస్సయితే దసరా అనుకున్నా అప్పుడు OG - దేవర సినిమాలు కొన్ని రోజుల గ్యాప్ లోనే విడుదల అవుతున్నాయి. ఇక మిగిలింది డిసెంబర్ మాత్రమే. తెలుగులో ఇంకా ఏ బిగ్ స్టార్ కూడా డిసెంబర్ ను ఇంకా ఫైనల్ చేసుకోలేదు. గేమ్ ఛేంజర్ అప్పుడే అనుకున్నా ఇంకా ఫైనల్ కాల్ రాలేదు. కాబట్టి కల్కి నిర్మాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News