దసరా...సంక్రాంతి సెంటిమెంట్ మార్చేలా కల్కీ?
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా మే9న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
సమ్మర్ అంటే టాలీవుడ్ కి ఎంతో కాలం నుంచి చిన్న చూపుగానే కనిపిస్తుంది. స్టార్ హీరోలంతా సంక్రాంతి..దసారా..దీపావళి...క్రిస్మస్ అంటూ ఆ సెలవుల్ని టార్గెట్ చేస్తారు తప్ప! వేసవి సెలవులు మాత్రం ఎప్పుడూ టార్గెట్ కావు. ఏప్రిల్ నుంచి మొదలయ్యే సెలవులు దాదాపు రెండు నెలలు ఉన్నా? అప్పుడు మా సినిమాలు ఎందుకు రిలీజ్ చేయలి? అన్నట్లే కనిపిస్తుంటారు. ఇప్పుడా లెక్క మారాల్సిన అవసరం ఉంది.
ఆ లెక్క మార్చడానికి 'కల్కీ 2898' రంగం సిద్దం చేస్తుంది. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా మే9న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా వేసవి సెలవులు చూసుకుని చిత్రాన్ని రిలీజ్ చేస్తు న్నారు. వరల్డ్ వైడ్ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇక ఇదే సీజన్ లో ఈ సినిమాకి వేసవి సెలవులు కసిసొస్తాయి అనడంలో ఎలాంటి సందేభం లేదు. మే అంటే అప్పటికే స్కూల్..కాలేజీలు అన్ని సెలవుల్లో ఉంటాయి.
కుర్రాళ్లంతా ఊళ్లలో క్రికెట్..వాలీబాల్ ఆడుకునే సమయంలోనే కల్కి రిలీజ్ అవ్వడం ఆసినిమాకి ప్రధా నంగా కలిసొచ్చే అంశం అనొచ్చు. సినిమాకి హిట్ టాక్ వచ్చిందంటే? బాక్సాఫీస్ మోతెక్కడం ఖాయం. అసలే ప్రభాస్ సలార్ హిట్ తో పుల్ ఫాంలో ఉన్నాడు. అటు కల్కీపై అంచనాలు పతాక స్థాయిలో కొనసా గుతున్నాయి. ఇవన్నీ కల్కిని సమ్మర్ హిట్ గా నిలుపుతాయని అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఇదే జరిగితే సమ్మర్ సీజన్ లో మేము ఉన్నామంటూ మరింత మంది స్టార్ హీరోలు రిలీజ్ కి వచ్చే అవకాశం ఉంటుంది. 'దేవర' కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాలి. కానీ షూటింగ్ డిలే అవ్వడంతో రిలీజ్ వాయిదా పడింది. లేదంటే 'కల్కీ' కంటే ముందే 'దేవర' సమ్మర్ సీజన్ ని ఎన్ క్యాష్ చేసుకునేది.