కల్కి 2898ఏడీ… ఇప్పుడే అంత డిమాండా..

రెగ్యులర్ గా మూవీకి సంబందించిన అప్డేట్స్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకులకి అందిస్తోంది.

Update: 2024-06-03 15:30 GMT

ఈ ఏడాదికి టాలీవుడ్ నుంచి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి రాబోయే పాన్ ఇండియా చిత్రం కల్కి 2898ఏడీ. ఈ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఏకంగా 22 భాషలలో మూవీని తీసుకురాబోతున్నారు. ఇంగ్లీష్, చైనా భాషలలో కూడా సినిమా రిలీజ్ అవుతూ ఉండటం విశేషం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భైరవ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి.

రెగ్యులర్ గా మూవీకి సంబందించిన అప్డేట్స్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకులకి అందిస్తోంది. ఈ సినిమాలో బుజ్జి విత్ భైరవ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసి మూవీపై అంచనాలు పెంచింది. సినిమా కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన ఎలక్ట్రికల్ కారు ఇప్పటికే ప్రమోషన్స్ లో వాడుతున్నారు. అమెజాన్ ప్రైమ్ లో బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ ని రిలీజ్ చేశారు. ఇందులో భైరవ బుజ్జి అనే కారుని ఎలా డిజైన్ చేశాడో చూపించారు.

ఈ యానిమేషన్ సిరీస్ ని పబ్లిక్ నుంచి స్పందన వస్తోంది. ఇక మూవీ నుంచి సాంగ్స్, ట్రైలర్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉన్నాయి. వీటితో మూవీపై మరింత హైప్ క్రియేట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. కచ్చితంగా కల్కి 2898 ఏడీ మూవీ వండర్స్ క్రియేట్ చేస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొని ఉంది. అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ యాక్టర్స్ ఈ చిత్రంలో నటించారు.

వీరి కారణంగా కూడా మూవీపై హైప్ పెరిగింది. ప్రమోషన్స్ తో రోజు రోజుకి బజ్ పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో ఇప్పటికే కొన్ని ఏరియాలో థియేటర్స్ లో కల్కి బుకింగ్స్ ఓపెన్ చేశారంట. డల్లాస్ స్టేట్ లో బుకింగ్స్ ఓపెన్ చేసిన థియేటర్స్ లలో టికెట్స్ ఆల్ మోస్ట్ అమ్ముడైపోయాయంట. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్లని ఆడియన్స్ బ్లాక్ చేసుకుంటున్నారు.

సినిమా రిలీజ్ కి ఇంకా 26 రోజుల సమయం ఉంది. ఈ లోపు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కల్కి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజు ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్ట్ చేస్తుంది అనేదాని బట్టి లాంగ్ రన్ వసూళ్లు ఆధారపడి ఉంటాయనేది సినీ విశ్లేషకుల అంచనా. ఈ సినిమా క్లిక్ అయితే వెంటనే సీక్వెల్ ని కూడా నాగ్ అశ్విన్ టీమ్ ప్రకటించే అవకాశం ఉందంట.

Tags:    

Similar News