తెలుగు రాష్ట్రాల ఫస్ట్ డే రికార్డ్.. కల్కి బ్రేక్ చేస్తుందా?

పాన్ ఇండియా కల్చర్ వచ్చిన తర్వాత తెలుగు సినిమాల కలెక్షన్స్ విపరీతంగా పెరిగాయి.

Update: 2024-06-25 04:00 GMT

పాన్ ఇండియా కల్చర్ వచ్చిన తర్వాత తెలుగు సినిమాల కలెక్షన్స్ విపరీతంగా పెరిగాయి. స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాల ఓపెనింగ్ డే కలెక్షన్స్ 100 కోట్లు దాటేస్తున్నాయి. ఒకప్పుడు వంద కోట్ల గ్రాస్ అందుకోవడానికి కనీసం మూడు, నాలుగు రోజుల సమయం పట్టేది. అయితే పెరిగిన టికెట్ ధరలతో పాటు అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేయడం మూవీలకి మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి.

సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే రెండు వారల పాటు స్థిరమైన కలెక్షన్స్ తో తెలుగు సినిమా ఈజీగా 500+ కోట్లు వసూళ్లు సాధించగలుగుతున్నాయి. ఈ ఏడాది హనుమాన్ మూవీ పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ అందుకొని 300+ కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ అందుకోవాలని స్టార్ హీరోలు అనుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరికి ఆ నెంబర్ టచ్ చేయడం సాధ్యం కాలేదు.

కానీ కల్కి 2898ఏడీ మూవీతో ప్రభాస్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాల జాబితాలో ఆర్ఆర్ఆర్ మొదటి స్థానంలో ఉంది. ఈ మూవీ 74.11 కోట్ల గ్రాస్ ఫస్ట్ డే అందుకుంది. రెండో స్థానంలో 50.49 కోట్ల గ్రాస్ తో ప్రభాస్ సలార్ మూవీ నిలిచింది. మూడో స్థానంలో బాహుబలి 2 ఉంది. ఈ సినిమా మొదటి రోజు 43 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

నాలుగో స్థానంలో గుంటూరు కారం నిలవడం విశేషం. ఈ చిత్రం 38.88 కోట్లు మొదటి రోజు వసూళ్లు చేసింది. ఐదో స్థానంలో మెగాస్టార్ సైరా మూవీ ఉంది. ఈ సినిమా 38.75 కోట్లు కలెక్షన్స్ సాధించింది. జూన్ 27న రిలీజ్ కాబోయే కల్కి 2898ఏడీ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. కచ్చితంగా 100 కోట్ల మార్కెట్ ని ఈ చిత్రం అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

సినిమా మీద ఉన్న ఎక్స్ పెక్టేషన్స్, ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే లాంటి స్టార్ క్యాస్టింగ్ కాంబినేషన్ కారణంగా మూవీపైన ఇంటరెస్ట్ క్రియేట్ అయ్యింది. అలాగే ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో వస్తోన్న సినిమా కావడంతో కల్కి2898ఏడీని మొదటి రోజే చూడాలనే క్యూరియాసిటీ చాలా మందిలో ఉంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News