కల్కి 2898ఏడీ నైజాం లెక్క ఇదే
ఇది ఇలా ఉంటే నైజాం ఏరియాలో కల్కి సినిమాపై 65 కోట్ల బిజినెస్ జరిగింది.
డార్లింగ్ ప్రభాస్ సినిమాలకు నైజాంలో మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. బాహుబలి సినిమా తర్వాత ఆయన మార్కెట్ నైజాంలో బీభత్సంగా పెరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రభాస్ సినిమాలపై నైజాంలో భారీ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. బడా డిస్ట్రిబ్యూటర్స్ ప్రభాస్ సినిమా రైట్స్ కోసం పోటీ పడుతూ ఉంటారు. కల్కి 2898ఏడీ కలెక్షన్స్ మరోసారి నైజాం బాక్సాఫీస్ షేర్ డార్లింగ్ ప్రభాస్ అని ప్రూవ్ చేశాయి. ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని నైజాంలో అందుకోవడం విశేషం.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మైథిలాజికల్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీకి వరల్డ్ వైడ్ గా అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. కల్కి 2898ఏడీ మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. రిలీజ్ అయిన అన్ని భాషలలో కూడా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ క్రాస్ చేసి భారీ లాభాలను డిస్ట్రిబ్యూటర్స్ కి కల్కి మూవీ అందించింది. నార్త్ అమెరికా, హిందీ స్టేట్స్ లో ఇప్పటికి కూడా డీసెంట్ కలెక్షన్స్ ను కల్కి మూవీ రాబడుతూ ఉండడం విశేషం.
ఇది ఇలా ఉంటే నైజాం ఏరియాలో కల్కి సినిమాపై 65 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పటివరకు మూవీ 90 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత నైజాంలో 90 కోట్ల షేర్ అందుకున్న మూవీగా కల్కి రికార్డు సృష్టించింది. ఈ లెక్కన కల్కి సినిమా నైజాంలో 25 కోట్ల ప్రాఫిట్ ని అందుకోవడం విశేషం.
నాలుగు వారాలు కూడా పూర్తికాకముందే ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకుందంటే నైజాంలో కల్కి చిత్రానికి ఎంతటి అద్భుత ఆదరణ లభించిందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో 168 కోట్ల బిజినెస్ వాల్యూతో కల్కి 2898ఏడీ మూవీ రిలీజ్ అయ్యింది. ఇప్పటి వరకు 182 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. ఇందులో మెజారిటీ కలెక్షన్స్ నైజాం నుంచి రావడం విశేషం. నైజాంతో పోల్చుకుంటే సీడెడ్, ఆంధ్రాలో కల్కికి కొంత తక్కువగానే కలెక్షన్స్ వచ్చాయి.
లాంగ్ రన్ లో కల్కి ఏ స్థాయిలో షేర్ ని హోల్డ్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కల్కి 2898ఏడీ గ్రాండ్ సక్సెస్ తో పార్ట్ 2 మీద భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సీక్వెల్ కచ్చితంగా బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ కల్కి చిత్రంతో నైజాం తనకి తిరుగు లేదని మరోసారి నిరూపించుకున్నారు.