నార్త్ అమెరికాలో కల్కి హవా… ఒక్క బాహుబలి 2 తప్ప..

ప్రభాస్ కల్కి సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మరిన్ని రికార్డులు బ్లాస్ట్ అయ్యేలా ఉన్నాయి.

Update: 2024-07-15 09:59 GMT

ప్రభాస్ కల్కి సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మరిన్ని రికార్డులు బ్లాస్ట్ అయ్యేలా ఉన్నాయి. డైరెక్టర్ మేకింగ్ విధానానికి బాలీవుడ్ కూడా ఫిదా అవుతోంది. ఈ మూవీ మూడో వారంలోకి అడుగుపెట్టింది. అయిన కూడా కలెక్షన్స్ పరంగా డ్రాప్ కనిపించడం లేదు. వీకెండ్ రెండు రోజులు కూడా అన్ని భాషలలో కల్కి మూవీ మంచి వసూళ్లని అందుకుంది. తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు తగ్గించడంతో అత్యధిక ప్రాఫిట్ దిశగా మూవీ దూసుకుపోతోంది. జులై 19న వరకు చెప్పుకోదగ్గ సినిమాలు థియేటర్స్ లేవు.

ఈ స్పేస్ కూడా కల్కి మూవీకి బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. నార్త్ ఇండియాలో ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ హిందీ మూవీగా కల్కి నిలిచింది. 250+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని సాధించింది. ఓవర్సీస్ లో కూడా కల్కి హవా కొనసాగుతోంది. థియేటర్స్ కి ప్రేక్షకులు విపరీతంగా తరలివచ్చి మూవీని ఆస్వాదిస్తున్నారు. దీంతో మంచి వసూళ్లని నార్త్ అమెరికాలో కల్కి మూవీ సాధింస్తోంది.

నార్త్ అమెరికాలో బాహుబలి 2 మూవీ 20.77 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో హైయెస్ట్ వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా ఉంది. దీని తర్వాత స్థానంలో షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ ఉండేది. లాంగ్ రన్ లో ఈ చిత్రం 17.48 కోట్ల మిలియన్ డాలర్స్ వసూళ్లని సాధించింది. అయితే కల్కి మూవీ మూడో వారంలో పఠాన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. 18 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ కి దగ్గరగా కల్కి మూవీ వసూళ్లని అందుకుంది.

తద్వారా కల్కి మూవీ టాప్ 2 హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా నార్త్ అమెరికాలో నిలిచింది. ఇలాగే మరో వారం, పది రోజులు కల్కి సినిమాలకి వసూళ్లు వస్తే బాహుబలి మూవీ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందనే మాట ట్రేడ్ పండితుల నుంచి వినిపిస్తోంది. ఒక వేళ బ్రేక్ చేసిన, చేయకపోయిన నార్త్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న టాప్ 2 ప్రభాస్ సినిమాలుగానే ఉండబోతున్నాయి.

ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం ఇప్పట్లో ఎవరి తరం కాదనే మాట వినిపిస్తోంది. మళ్ళీ హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ అందుకోవాలంటే అది ప్రభాస్ కే సాధ్యం అవుతుందని అంచనా వేస్తున్నారు. డార్లింగ్ నుంచి సలార్ పార్ట్ 2, కల్కి2898ఏడీ పార్ట్ 2 సినిమాలు నెక్స్ట్ రెండేళ్లలో రానున్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేయొచ్చని భావిస్తున్నారు.

Tags:    

Similar News