కల్కి కలెక్షన్స్… ఏడు రోజుల్లో వచ్చింది ఎంత?

డార్లింగ్ ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898ఏడీ థియేటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

Update: 2024-07-04 10:53 GMT

డార్లింగ్ ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898ఏడీ థియేటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రేక్షకులు అన్నికోట్ల సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. యంగ్ రెబల్ స్టార్ భైరవ పాత్రలో చేసిన పెర్ఫార్మెన్స్, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ అద్భుతమైన నటన, అంతకు మించి నాగ్ అశ్విన్ మేకింగ్ విజన్ కి ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్న కూడా వాటిని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో సినిమాకి అద్భుతంగా ఆదరణ ప్రపంచ వ్యాప్తంగా లభిస్తోంది. ఈ సినిమా ఏడురోజుల్లో వరల్డ్ వైడ్ గా 725 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వీక్ డేస్ కావడం వలన కలెక్షన్స్ తగ్గిన కూడా డీసెంట్ వసూళ్లని కల్కి అందుకుంటుంది. అందుకే రోజురోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. వెయ్యి కోట్ల దిశగా కల్కి మూవీ అడుగులు వేస్తోంది. లాంగ్ రన్ లో వరల్డ్ వైడ్ గా కల్కి మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలనే ఆసక్తి అందరిలో ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా నార్త్ అమెరికాలో ఇప్పటికే 13 మిలియన్ డాలర్స్ కి దగ్గరగా వచ్చింది. అలాగే నార్త్ ఇండియాలో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు తగ్గిస్తే మళ్ళీ కలెక్షన్స్ పెరుగుతాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు కలెక్షన్స్ చూసుకుంటే టికెట్ ధరలు తగ్గించే ఆలోచనలో నిర్మాత అశ్వినీదత్ ఉన్నారంట.

ఇదిలా ఉంటే ఏడోరోజు వరల్డ్ వైడ్ గా 45 కోట్ల గ్రాస్ కల్కి మూవీ వసూళ్లు చేసిందంట. దీంతో ఓవరాల్ కలెక్షన్స్ 725 కోట్లు దాటింది. ఇక మూవీ బ్రేక్ ఈవెన్ అందుకొని ప్రాఫిట్ దిశగా ప్రయాణం చేస్తోంది. కల్కి 2898ఏడీ సీక్వెల్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోందంట. ఆ సినిమాని వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి 2025 జూన్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇదిలా ఉంటే గత ఏడాది వచ్చిన సలార్ కలెక్షన్స్ ని కల్కి మూవీ ఇప్పటికే క్రాస్ చేసింది. నార్త్ అమెరికాలో కూడా ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ రికార్డ్స్ ని బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతోంది. కల్కి పార్ట్ 1 వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకుంటే పార్ట్ 2 కచ్చితంగా బాహుబలి2 కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News

eac