కల్కి2898ఏడీ… ఇప్పటి వరకు ప్రాఫిట్ ఎంతంటే?
ఓక మంచి కథని, అంతే మంచి కథనం జోడించి చెబితే సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని కొన్ని సినిమాలు ప్రూవ్ చేస్తాయి.
ఓక మంచి కథని, అంతే మంచి కథనం జోడించి చెబితే సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని కొన్ని సినిమాలు ప్రూవ్ చేస్తాయి. బడ్జెట్ ఎంతనేది ఆడియన్స్ కి సెకండ్ మ్యాటర్… డైరెక్టర్ చెప్పాలనుకుంటున్న కంటెంట్ ఏంటి అనేది ఫస్ట్ ఛాయస్ గా ఉంటుంది. కంటెంట్ బాగుంటుంది అనే ఫీలింగ్ ని ఆడియన్స్ లోకి టీజర్, ట్రైలర్స్ ద్వారా పంపించగలిగితే కచ్చితంగా అలాంటి సినిమాలకి ప్రేక్షకాదరణ బాగుంటుంది. ఆ తరువాత థియేటర్స్ 2 లేదా 3 గంటలు ఎంతగా ఎంగేజ్ చేశారనే దాని మీద సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది.
ఇలా నాగ్ అశ్విన్ ఇమాజినేషన్ నుంచి పుట్టి థియేటర్స్ లోకి వచ్చి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న చిత్రం కల్కి2898ఏడీ. మన పురాణాలలో చెప్పబడిన శ్రీమహావిష్ణువు 10వ అవతారం అయిన కల్కి పుట్టుక ఎలా ఉండొచ్చు అనే ఆలోచన నుంచి కల్కి పురాణం, భవిష్యపురాణం, భాగవతం, మహా భారతం రిఫరెన్స్ తో కల్కి 2898ఏడీ చిత్రాన్ని కంప్లీట్ ఫిక్షనల్ వరల్డ్ లో చెప్పే ప్రయత్నం చేశారు. సుమారు 600+ కోట్ల బడ్జెట్ తో ఈ కథాంశానికి దృశ్యరూపం ఇచ్చారు.
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి స్టార్ చరిష్మా కారణంగా ఈ సినిమాకి విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ప్రమోషన్స్ చేసిన కూడా మరీ అగ్రెసివ్ మ్యానర్ లో వెళ్ళలేదు. అయిన కూడా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ మిక్స్ స్టోరీ, స్టార్ కాంబినేషన్ కారణంగా సినిమాకి మొదటి రోజు 190+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. సినిమాకి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. దీనికి పోటీగా మరి ఏ ఇతర సినిమాలు లేవు. దీంతో ప్రేక్షకులు కల్కి మూవీ చూడటానికి విపరీతంగా ఆసక్తి చూపించారు.
ఈ కారణంగానే వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ ని కల్కి మూవీ అందుకుంది. 370 కోట్ల బిజినెస్ వేల్యూతో కల్కి మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. అయితే సినిమాల పట్ల ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించని ఇలాంటి సమయంలో 370 కోట్లు అంటే చాలా పెద్ద నెంబర్ గానే కనిపించింది. కానీ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల స్పందన చూసి బ్రేక్ ఈవెన్ చాలా చిన్నదైపోయింది. దీంతో 10 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని కల్కి అందుకుంది.
ఆపై వచ్చేదంతా ప్రాఫిట్ నే. ఇప్పటి వరకు మూవీకి 125 కోట్ల ప్రాఫిట్ వచ్చిందంట. టాలీవుడ్ లో అత్యధిక ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాల జాబితాలో కల్కి 2898ఏడీ మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బాహుబలి 2, రెండో స్థానంలో హనుమాన్ ఉంది. ప్రస్తుతం థియేటర్స్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఇండియన్ 2 ఆడియన్స్ ని మెప్పించలేదు. అందుకే స్టిల్ కల్కికి మంచి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయని తెలుస్తోంది.