కల్కి 2898AD.. ఆ రూట్లో కూడా గ్రాండ్ రిలీజ్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898ఏడీ మూవీ జూన్ 28న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898ఏడీ మూవీ జూన్ 28న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. వరల్డ్ వైడ్ గా 22 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. భారీ మల్టీ స్టారర్ చిత్రంగా పాన్ వరల్డ్ రేంజ్ లో కల్కి 2898ఏడీ మూవీ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే కల్కి ప్రమోషన్స్ లో బాగా బుజ్జిని పరిచయం చేశారు. కల్కి మూవీ కోసం ప్రత్యేకంగా ఈ కారుని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ కారుని ప్రమోషన్స్ కోసం ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కల్కి ప్రీప్రొడక్షన్ ఓ వైపు నడుస్తోంది. ఇప్పటికే మూవీ 2D వెర్షన్ సిద్ధం అయిపోయిందంట. నాగ్ అశ్విన్ కూడా అవుట్ ఫుట్ చూసి సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. అందుకే అతను ప్రమోషన్స్ మీద ఫోకస్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం కల్కి 2898ఏడీ 3D వెర్షన్ సిద్ధం చేస్తున్నారంట. ముఖ్యంగా ఐమ్యాక్స్ స్క్రీన్స్ కోసం ఈ 3D వెర్షన్ ని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కల్కి 2898ఏడీ మూవీని త్రీడీలో కూడా సిల్వర్ స్క్రీన్ పై చూసి ఆ విజువలైజేషన్ ని విర్చువల్ గా ఆశ్వాదించవచ్చు. హాలీవుడ్ లో కూడా కల్కి 2898ఏడీ రిలీజ్ కాబోతోంది. వరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్స్ లో కల్కిని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే 3D లో ఇప్పటివరకు వచ్చిన ఇండియన్ సినిమాల్లో ఏది కూడా అంతగా క్లిక్ కాలేదు. రాజమౌళి కూడా RRR ను చివరి నిమిషంలో 3D లో విడుదల చేయాలని కొంత వర్క్ చేశారు. కానీ ఆ వెర్షన్ ను ఎవరు పట్టించుకోలేదు. మరి కల్కి ఏమైనా క్లిక్ అవుతుందో లేదో చూడాలి. ఈ చిత్రాన్ని మేగ్జిమమ్ చాలా చోట్ల నిర్మాణ సంస్థ అడ్వాన్స్ బేస్డ్ గా మాట్లాడుకొని సొంతంగా రిలీజ్ చేస్తుందంట.
అంటే మూవీ ద్వారా వచ్చే కలెక్షన్స్ అన్ని కూడా డైరెక్ట్ గా నిర్మాతకే అందుతాయి. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి 2898ఏడీ ద్వారా 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించాలని చిత్ర యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ చిత్రంలో అమితాబచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ హీరోయిన్స్ నటించారు.
అందుకే మూవీ పైన దేశ వ్యాప్తంగా హైప్ నెలకొని ఉంది. ఇక ఈ నెల రోజుల ప్రమోషన్ ఏ స్థాయిలో ఉంటే సినిమాకి ఫస్ట్ డే ఓపెనింగ్ ఆ రేంజ్ లో ఉంటాయని సినీ విశ్లేషకులు అంటున్న మాట. ముఖ్యంగా నార్త్ లో స్ట్రాంగ్ ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అలాగే కల్కి మూవీ కంటెంట్ ఏంటి అనేది కూడా జనాల్లోకి బలంగా వెళ్లేలా చూడాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.