కల్కి సక్సెస్ వెనుక తెలుగు మీడియా!

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Update: 2024-07-08 03:00 GMT

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికే దాదాపు ₹800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. వచ్చే వారం వరకూ బాక్సాఫీస్ వద్ద పోటీ అనేదే లేదు కాబట్టి, ఈజీగా ₹1000 కోట్ల మార్క్ క్రాస్ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-5 చిత్రాల జాబితాలో చేరుతుంది. అయితే ఈ మూవీ ఇంత పెద్ద సక్సెస్ అందుకోవడంలో 'తెలుగు మీడియా' పాత్ర ఎంతో ఉందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలుగు మీడియా 'కల్కి 2898 AD' చిత్రాన్ని మొదటి నుంచీ ఎంతగానో ప్రమోట్ చేసింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో 'ప్రాజెక్ట్ K' పేరుతో ప్రభాస్ - డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మన తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలానే ఉద్దేశ్యంతో, మీడియా సైతం తమవంతు సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎప్పటికప్పుడు 'కల్కి'కి సంబంధించిన వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది.

టీవీ ఛానల్స్, వెబ్ సైట్స్, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా 'కల్కి' ప్రమోషనల్ మెటీరియల్ ను ప్రచారం చేస్తూ.. ఈ ప్రాజెక్ట్ గురించి ట్రేడ్ లో చర్చ జరిగేలా చేశాయి, సినిమాపై అంచనాలు క్రియేట్ అవ్వడానికి కారణమయ్యాయి. అలానే విడుదలకు ముందు ఈ చిత్రానికి కావాల్సినంత బజ్ తీసుకురావడానికి, జనాలకు చేరువ చేయడానికి తగిన సహకారం అందించాయి. దాన్నే బాలీవుడ్ మీడియా కూడా ఫాలో అవ్వడంతో.. నార్త్ ఇండియా నుంచి నార్త్ అమెరికా వరకూ అందరూ కల్కి గురించే మాట్లాడుకున్నారు.

రిలీజ్ తర్వాత కూడా 'కల్కి 2898 AD' చిత్రానికి తగినంత పబ్లిసిటీ ఇచ్చింది తెలుగు మీడియా. సినిమాలో అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, వాటిని ఎక్కడా హైలైట్ చేయకుండా దాదాపు తెలుగు మీడియా పీపుల్ అందరూ సానుకూల సమీక్షలు రాశారు.. మంచి రేటింగ్స్ ఇచ్చారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్టాండర్డ్స్ లో రూపొందించిన సినిమా అంటూ గొప్పగా కొనియాడారు. దీనికి పాజిటివ్ టాక్ కూడా తోడవడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదవుతున్నాయి.

పురాణాలు, ఇతిహాసాలను భవిష్యత్ ప్రపంచానికి ముడిపెడుతూ తీసిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి'. కొత్త పాయింట్ అయినా, కంటెంట్ బాగున్నా కూడా.. సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం మాత్రం తెలుగు మీడియా అనే చెప్పాలి. మంచి సినిమాను సపోర్ట్ చేయడానికి, దాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లడానికి 'తెలుగు మీడియా' ఎప్పుడూ ముందే ఉంటుంది. గతంలోనూ అనేక సినిమాలు మీడియా మద్దతుతోనే విజయాలు అందుకున్నాయి.

Tags:    

Similar News