కల్కి… నార్త్ అమెరికా కలెక్షన్స్ ఎంతంటే?

డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 1100 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసింది.

Update: 2024-07-31 06:25 GMT

డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 1100 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. ఐదు వారాల నుంచి అద్భుతమైన ప్రేక్షకాదరణతో మూవీ థియేటర్స్ లో కొనసాగుతోంది. నాగ్ అశ్విన్ సృష్టించిన భవిష్యత్ ప్రపంచాన్ని చూడటానికి ఇప్పటికి పబ్లిక్ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఐదు వారాల తర్వాత కూడా ఈ సినిమాకి డీసెంట్ వసూళ్లు లభిస్తున్నాయి. ఇక నార్త్ అమెరికాలో అయితే కల్కి మూవీ నాన్ బాహుబలి 2 రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసింది.

18 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ కి ఇప్పటికే క్రాస్ చేసి గత ఏడాది రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ జవాన్, పఠాన్ సినిమాల రికార్డ్స్ ని కూడా కల్కి మూవీ దాటేసింది. అలాగే ఓవరాల్ కలెక్షన్స్ పరంగా కూడా జవాన్ రికార్డ్ ని బ్రేక్ చేసే దిశగా కల్కి మూవీ అడుగులేస్తోంది. సౌత్ ఇండియాలో నాల్గవ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా కల్కి మూవీ ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి మూడు స్థానాలలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీస్ ఉండటం విశేషం.

ఇండియన్ మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ చిత్రంగా కల్కి 2898ఏడీని నాగ్ అశ్విన్ చెప్పడం అందరికి కనెక్ట్ అయ్యింది. అలాగే సినిమాలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకునే, కమల్ హాసన్ లాంటి స్టార్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో కథని మార్వెల్ సిరీస్ ల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులకి రీచ్ చేశారు. అందుకే సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి.

విజువల్ స్పెక్టాక్యులస్ గా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించిన విధానం కూడా ప్రతి ఒక్కరికి నచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నార్త్ అమెరికాలో 18.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు డిస్ట్రిబ్యూటర్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ పోస్టర్ రిలీజ్ చేసింది. నార్త్ అమెరికాలో సెకండ్ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమాగా కల్కి మూవీ నిలిచిందని ట్వీట్ పేర్కొంది.

కల్కి సినిమా వరల్డ్ వైట్ గా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడంతో ఈ మూవీ సీక్వెల్స్ పైన ఎక్స్పెక్టేషన్స్ భారి స్థాయిలో క్రియేట్ అయ్యాయి. కల్కి పార్ట్ 2 రావడానికి కనీసం మూడేళ్ల సమయం పట్టొచ్చనే మాట వినిపిస్తోంది. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా షూటింగ్ పై ఫోకస్ చేయబోతున్నారు. తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో మూవీ తెరకెక్కనుంది. వచ్చే ఏడాది కల్కి 2898ఏడీ పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News