కల్కి : నాలుగు, ఎనిమిది కాదు పది..!

ముఖ్యంగా ఇండియన్ 2 సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

Update: 2024-07-17 04:55 GMT

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొంది విడుదల అయిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద మూడు వారాలు దాటినా కూడా సందడి కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా సరికొత్త రికార్డుల దిశగా దూసుకు పోతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు కల్కి ముందు నిలువలేక పోయాయి.

ముఖ్యంగా ఇండియన్ 2 సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు మూడు క్రేజీ సినిమాలు కూడా ఇలా వచ్చి అలా పోయాయి. దాంతో కల్కి సినిమాకు నాలుగో వారం కూడా బాక్సాఫీస్ గలగల కొనసాగుతూనే ఉంది.

ఇక థియేటర్ లో చూడలేని వారు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంతటి పెద్ద హిట్‌ మూవీ అయినా నాలుగు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతుంది. కానీ ముందు నుంచే ఓటీటీ లో కల్కి ని చూడాలంటే ఎక్కువ వారాలు ఆగాల్సిందే అంటూ ప్రకటిస్తూ వచ్చారు.

కల్కి సినిమా ను నాలుగు వారాల్లో కాకున్నా కనీసం ఎనిమిది వారాల్లో అయినా స్ట్రీమింగ్‌ చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం, చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం కల్కి సినిమాను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయాలి అంటే పది వారాలు వెయిట్‌ చేయాల్సిందేనట.

ఈ మధ్య కాలంలో ఒక క్రేజీ మూవీ, అది కాకుండా సూపర్‌ హిట్‌ అయిన మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ కు పది వారాల సమయం తీసుకోవడం చాలా అరుదుగా కనిపించే విషయం. ఓటీటీ డీల్‌ క్లోజ్ అవ్వకుంటే లేదంటే మరేదైనా వివాదం ఉంటే తప్ప ఇన్నాళ్ల వెయిటింగ్‌ ఉంటుంది.

కానీ కల్కి విషయంలో అలాంటివి ఏమీ లేవు. పది వారాల పాటు బాక్సాఫీస్ వద్ద సందడి ఉంటుందనే నమ్మకంతో మేకర్స్ ఓటీటీ స్ట్రీమింగ్‌ ను వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే నెట్‌ ఫ్లిక్స్ హిందీ వర్షన్ స్ట్రీమింగ్‌ హక్కులను మరియు అమెజాన్ ప్రైమ్‌ సౌత్‌ ఇండియన్ భాషల స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న విషయం తెల్సిందే.

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు కల్కిని ఓటీటీ లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటున్న వారు సెప్టెంబర్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే. 10 వారాల పాటు ఈ సినిమా సందడి కొనసాగుతూనే ఉంటుంది. కనుక అప్పుడు స్ట్రీమింగ్‌ చేసినా కూడా భారీగా స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News