'కల్కి 2898 AD' USA ప్రీమియర్ షో టాక్

అమెరికా నుంచి వ‌చ్చిన స‌మీక్ష‌ల ప్ర‌కారం.. క‌ల్కి ఎలా ఉంది అంటే...? డీటెయిల్స్ లోకి వెళ్లాలి.

Update: 2024-06-27 04:25 GMT

మోస్ట్ అవైటెడ్ 2024 మూవీ 'కల్కి 2898 AD' ఈ గురువారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించారు. అమెరికా నుంచి విడుద‌లైన 'కల్కి 2898 AD' ప్రారంభ సమీక్షలు ఎట్టకేలకు ఉత్కంఠ‌ను పెంచాయి. అన్ని చోట్లా స‌మీక్ష‌లు చాలా సానుకూలంగా ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం ఈ సినిమా క‌థాంశం స‌హా సాంకేతిక అంశాలు న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న ఇలా అన్ని కోణాల్లో అద్భుతంగా ఉంద‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. దుష్ట శక్తుల నుండి ప్రపంచాన్ని రక్షించడానికి భూమిపైకి వస్తున్నవిష్ణువు ఆధునిక అవతారం క‌ల్కి చుట్టూ క‌థ‌ తిరుగుతుంది. కల్కి 2898 AD మొదటి షో అమెరికా థియేటర్‌లో ప్రదర్శితం కాగా.. ప్రేక్షకుల నుండి అద్భుత స్పందనను అందుకుంది. ప్రభాస్ ఎంట్రీ సీన్‌పై అభిమానులు ఎంతో ఎగ్జ‌యిట్ అయ్యార‌ని స‌మాచారం. అమెరికా నుంచి వ‌చ్చిన స‌మీక్ష‌ల ప్ర‌కారం.. క‌ల్కి ఎలా ఉంది అంటే...? డీటెయిల్స్ లోకి వెళ్లాలి.

ప్రీమియర్ తర్వాత సమీక్షను షేర్ చేస్తూ ఒక నెటిజ‌న్ X ఖాతాలో ఇలా రాసారు. పర్ఫెక్ట్ ఫస్ట్ హాఫ్. విజువల్స్ ఇప్ప‌టివ‌ర‌కూ మునుపెన్న‌డూ భారతీయ సినిమా నుండి చూడని విధంగా అద్భుత లోకంలోకి తీసుకుని వెళ్లాయి. ఇది ఆసక్తికరమైన కథాంశంతో పాటు ఆకట్టుకునే ఎన్నో అంశాల‌తో నిండి ఉంది. స్క్రీన్‌ప్లే చాలా వరకు బాగానే ఉంది. ప్రభాస్‌కు సరదా పాత్రలో చాలా కాలం త‌ర్వాత క‌నిపించారు. ప్ర‌థ‌మార్థంలో అత‌డికి స్క్రీన్ సమయం పరిమితం. ద్వితీయార్థంలో అద్భుతంగా క‌నిపించాడు'' అని రాసారు. మరొకరు ఇలా స‌మీక్షించారు. ''ప్రభాస్ - నాగ్ అశ్విన్ చరిత్ర సృష్టించారు! మీరు సినిమా మొదటి 30 నిమిషాల్లోనే గొప్ప‌గా అనుభూతి చెందుతారు''అని రాసారు. మ‌రో నెటిజన్ స‌మీక్షిస్తూ..''విరామానికి 30 నిమిషాల ముందు #KALKI2898AD హిట్ మాత్రమే కాదు... ఇది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్‌'' అని మూడవ వ్య‌క్తి Xలో పోస్ట్ చేసారు.

ఒక అంతర్జాతీయ చలనచిత్ర జర్నలిస్ట్ Xలో తన సమీక్షను షేర్ చేసారు. ఈ స‌మీక్ష సారాంశం ఇలా ఉంది. ''కల్కి 2898 AD అత్యుత్తమమైనది! దృశ్యపరంగా అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ అనుభవం. అందులో కొంచెం బ్లేడ్ రన్నర్ & మ్యాడ్ మ్యాక్స్ కూడా ఉన్నాయి. ప్రభాస్ VS అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్ అద్భుతంగా ఉంది. దీపిక & దిశ చాలా అందంగా ఉన్నారు. వారు నా తల తిప్పేలా చేసారు'' అని రాసారు.

విజువ‌ల్ వండ‌ర్:

భారీ అంచనాల న‌డుమ విడుదలైన క‌ల్కి ఓవ‌రాల్ గా పాజిటివ్ టాక్ తో ప్రారంభ‌మైంది. ఇది మహాభారతం ఎపిసోడ్‌తో ప్రారంభ‌మై ఉత్కంఠ‌ను క‌లిగిస్తుంది. ప్ర‌థ‌మార్థం కంటే ప్ర‌భాస్ పాత్ర‌కు ద్వితీయార్థంలో అద్భుత‌మైన ఎలివేష‌న్ కుదిరింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె నటించిన ఎపిసోడ్‌లు ప్రథమార్థానికి హైలైట్‌గా నిలిచాయి. విశ్రాంతి బ్లాక్ పర్వాలేదు. ద్వితీయార్థానికి వ‌స్తే.. మొద‌టి భాగం కంటే ఇది ఇంకా ఉత్కంఠ‌ను పెంచింది. ఇక ప‌తాక స‌న్నివేశాలు ది బెస్ట్ గా తీర్చిదిద్ద‌డంలో నాగ్ అశ్విన్ పెద్ద స‌క్సెస‌య్యారు. ద్వితీయార్థంలో ప్ర‌ధాన పాత్ర‌లన్నీ ఊహించ‌ని ట్విస్ట్ ని ఇస్తాయి. అలాగే దేవ‌ర‌కొండ‌, దుల్కార్ ల అతిథి పాత్ర‌లు ఆక‌ట్టుకున్నాయి. ఓవ‌రాల్ గా ఈ సినిమా మొదటి భాగం కంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది . ఒక అద్భుతాన్ని మేక‌ర్స్ ఆవిష్క‌రించారు. వైజ‌యంతి ఫిలింస్ త‌ల‌పెట్టిన త‌ప‌స్సు ఎట్ట‌కేల‌కు ఫ‌లించింది. ఇది ఒక విజువ‌ల్ వండ‌ర్ .. అని స‌మీక్ష‌కులు త‌మ సమీక్ష‌ల్లో తెలిపారు.

మొద‌టి రోజు 200 కోట్లు అంచ‌నా:

'కల్కి 2898 AD' భారతదేశంలోని అన్ని భాషలలో ఇప్పటికే 19 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దేశీయ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 100 కోట్ల రూపాయలకు పైగా నెట్ ఓపెనింగ్‌ను వసూలు చేస్తుందని ఫిల్మ్ ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నందున ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్కును మొద‌టి రోజే దాటే అవకాశం ఉంది. సాన్ సిల్క్ నివేదిక ప్రకారం 'కల్కి 2898 AD' కేవ‌లం తెలుగు భాషలోనే 15 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. భారీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రం ఇప్పటికే 50 కోట్ల రూపాయలకు పైగా లోక‌ల్ గా వసూలు చేసింది.

Tags:    

Similar News