కల్కి 2898AD : పెద్ద పండగ వరకు ఆగాల్సిందేనా?

లాంగ్ రన్ లో సలార్‌ లో సాలిడ్ నెంబర్ ను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.

Update: 2024-01-06 07:30 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా తో చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రూ.700 కోట్ల దిశగా సలార్ సినిమా దూసుకు పోతుంది. లాంగ్ రన్ లో సలార్‌ లో సాలిడ్ నెంబర్ ను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.

సలార్‌ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో ప్రభాస్ తదుపరి సినిమా ప్రాజెక్ట్‌ కే 'కల్కి 2898AD' పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్‌ వరల్డ్‌ మూవీ అంటూ ప్రచారం చేస్తున్నారు.

మొదట అనుకున్న ప్రకారం 2024 సంక్రాంతికి కల్కి 2898AD సినిమా విడుదల అవ్వాల్సి ఉంది. కానీ షూటింగ్ పూర్తి అవ్వక పోవడంతో పాటు, వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ చాలా ఆలస్యం అవ్వబోతుంది. అందుకే 2024 సమ్మర్ కి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ గత ఏడాది లో ప్రకటించారు.

ఇప్పుడు సమ్మర్‌ నుంచి పెద్ద పండుగ దసరా కి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మర్‌ వరకు షూటింగ్‌ పూర్తి అయినా కూడా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇండియన్ 2 సినిమా ను ముగించిన కమల్‌ హాసన్ త్వరలో ఈ సినిమా షూటింగ్‌ లో ప్రభాస్‌ తో కలిసి పాల్గొనబోతున్నాడు.

మొత్తానికి కల్కి 2898AD సినిమా పై ఉన్న అంచనాలు మరింతగా పెంచే విధంగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఏది ఏమైనా 2024 లో కల్కి 2898AD సినిమా విడుదల అవ్వడం మాత్రం పక్కా. అది దసరా కే అవ్వచు లేదంటే ఇంకాస్త ఆలస్యం అవ్వచ్చు అంటూ ప్రభాస్‌ సన్నిహితులు ఆఫ్ ది రికార్డ్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News