కల్కి థీమ్ సాంగ్.. సీనియర్ బ్యూటీ నాట్యం అదుర్స్!

ఫస్ట్ ట్రైలర్ తో అంచనాలు పెంచిన మేకర్స్.. సెకండ్ ట్రైలర్ తో ఆ అంచనాలన్నీ ఆకాశాన్ని తాకేలా చేశారు.

Update: 2024-06-24 09:22 GMT

కల్కి 2898 ఏడీ.. ఈ సినిమా కోసమే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ను వినూత్నంగా చేస్తున్నారు. ముందు నుంచి పెద్దగా అప్డేట్స్ ఇవ్వకుండా.. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండగా జోష్ పెంచారు. ఈవెంట్స్ తక్కువగా నిర్వహించి.. వరుస అప్డేట్స్ ఇస్తూ మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఫస్ట్ ట్రైలర్ తో అంచనాలు పెంచిన మేకర్స్.. సెకండ్ ట్రైలర్ తో ఆ అంచనాలన్నీ ఆకాశాన్ని తాకేలా చేశారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్.. జర్నీ ఆఫ్ కల్కి అంటూ ప్రీ లూడ్స్ వీడియోస్ తో వేరే లెవల్ లో అలరించారు. సినిమాపై అన్ని వర్గాల ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మేకర్స్.. సినిమాలో క్యామియో రోల్స్ చేసిన ఒక్కొక్కరి లుక్స్ ను రిలీజ్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే భైరవ ఆంథమ్‌ సాంగ్‌ రిలీజ్ చేయగా.. నార్త్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సౌత్ లో మాత్రం మిక్స్ డ్ టాక్ అందుకుంది. రీసెంట్ గా క‌ల్కి థీమ్ సాంగ్‌ ను శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన మధుర నగ‌రంలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. చెప్పినట్లు నేడు సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. పూర్తి పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

ఇక కల్కి థీమ్ సాంగ్ కు సంతోష్ నారాయణ్ ఇచ్చిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచేలా ఉంది. ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే మధురలోని యమునా నది ఒడ్డున సీనియర్ నటి శోభనతో పాటు మరికొంతమంది డ్యాన్సర్లతో ఈ సాంగ్ కోసం స్పెషల్ వీడియో షూట్ చేశారు మేకర్స్. అందులో అంతా భరతనాట్యం చేస్తూ కనిపిస్తున్నారు. శోభన.. క్లాసికల్ గెటప్ లో తన ఎక్స్ప్రెషన్స్ తో అదరగొట్టారు. తన డ్యాన్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Read more!

మంచి టాలెంటెడ్ డ్యాన్సర్ అయిన శోభన.. కల్కి సినిమాలో కూడా నటిస్తున్నారు. మరియమ్ పాత్ర పోషిస్తున్న శోభనను.. సెకండ్ ట్రైలర్ లో కూడా చూపించారు మేకర్స్. దాదాపు 18 ఏళ్ల తర్వాత సినీ ఇండస్ట్రీలోకి కల్కితో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అనేక మంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

Full View
Tags:    

Similar News