కల్కి ట్రైలర్.. గెట్ రెడీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీ కోసం ఎంతలా అందరూ వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-06-05 05:55 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీ కోసం ఎంతలా అందరూ వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 27వ తేదీ ఎప్పుడు వస్తుందా? థియేటర్లలో సినిమా ఎప్పుడు చూస్తామా? అని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరితోపాటు చాలా మంది స్టార్ నటీనటులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన అమితాబ్ గ్లింప్స్, ప్రభాస్ యాడ్స్, పోస్టర్స్, యానిమేషన్ సిరీస్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ వెహికల్ బుజ్జికి అయితే ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో కల్కి మేకర్స్.. ప్రమోషన్స్ స్పీడ్ ను మరింత పెంచారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లో స్పెషల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. కొత్త ప్రపంచం వెయిట్ చేస్తుందంటా సోషల్ మీడియాలో రాసుకొచ్చి జూన్ 10వ తేదీన ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు.

దాంతోపాటు కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ప్రభాస్ వేరే లెవెల్ లో ఉన్నారు. మట్టి దిబ్బపై భైరవ రోల్ లో ఆకాశం వైపు చూస్తూ కనిపించారు. పోస్టర్ పై రైటప్ తో మరింత బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. అయితే ట్రైలర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తారా లేదా అందు కోసం ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహిస్తారన్న విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ముంబైలో ఈవెంట్ ఏర్పాటు చేసి ట్రైలర్ ను రిలీజ్ చేస్తారని రీసెంట్ గా టాక్ వినిపించింది.

ఇక సినిమా విషయానికొస్తే.. భారత పురాణాల ఆధారంగా నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మహావిష్ణువు చివరి అవతారమైన కల్కి ఆధారంగా ప్రభాస్ రోల్ ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో స్పెషల్ వెహికల్ బుజ్జి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తోంది. రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ తో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో తెలియాలంటే వేచి చూడాలి.

Tags:    

Similar News