కల్కి 2898AD బాక్సాఫీస్.. ఇది 1000 కోట్ల సునామీ!
తాజాగా టికెట్ ధరలు తగ్గించడంతో, సినిమాను టికెట్ ధరల కారణంగా చూడలేకపోయిన ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం విశేషం.
ప్రభాస్ నటించిన కల్కి 2898AD సినిమా రెండు వారాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి మంచి కలెక్షన్స్ సాధిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదటి రెండు వారాల్లోనే భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, ఇప్పుడు మూడో వారంలో కూడా సెంటిమెంట్‌ని కొనసాగిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజాగా టికెట్ ధరలు తగ్గించడంతో, సినిమాను టికెట్ ధరల కారణంగా చూడలేకపోయిన ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం విశేషం. దీంతో ఆన్లైన్ బుకింగ్స్ లో కూడా కొంత గ్రోత్ కనిపిస్తోంది. 14వ రోజు కంటే 15వ రోజు బుకింగ్స్ మరింతగా పెరిగినట్లు సమాచారం. కానీ టికెట్ ధరలు తగ్గడం వలన కలెక్షన్స్ కొంత డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ రికార్డులను అందుకోవడంలో ప్రభాస్ అస్సలు తగ్గడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో 15వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఈ సినిమా మరో రికార్డ్ అందుకుంది. హిందీలో కూడా రెండో వారం ఊహించని స్థాయిలో నెంబర్స్ పెరిగాయి. రెస్టు ఆఫ్ ఇండియాలో కూడా కలెక్షన్స్ పరంగా మంచి పెర్ఫార్మెన్స్ కొనసాగుతోంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా కల్కి 2898AD పర్వాలేదనిపించేలా కలెక్షన్స్ సాధిస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో 120 కోట్లకు పైగా షేర్ అందుకోవడం విశేషం.
ఇక వరల్డ్ వైడ్ గా కల్కి సినిమా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాహుబలి సినిమాతో 2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన హీరోగా క్రేజ్ అందుకున్న డార్లింగ్ ఇప్పుడు కల్కి తో వెయ్యి కోట్ల మార్క్ ను మరోసారి టచ్ చేశాడు. శని ఆదివారం కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో కలెక్షన్లు అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్ట్‌లు భావిస్తున్నారు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో మరింత గ్రోత్ ఉంటే, ఈ లెక్కలు మరింత పెరిగే అవకాశం ఉంది.
మొత్తం మీద, కల్కి 2898AD సినిమా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 1000 కోట్ల మార్క్ ను టచ్ చేయడం విశేషం. టాలీవుడ్ ఇండస్ట్రీలోలోనే కాకుండా దేశం మొత్తం మీద బిగ్ హిట్ లిస్టులో కల్కి నిలిచింది. ఇక మూడో వారంలో కూడా ఈ ఇంపాక్ట్ కొనసాగుతుందని అనిపిస్తుంది. ప్రభాస్ అభిమానులు మరియు సినిమా ప్రేక్షకులు ఈ సినిమా మరింత విజయవంతం కావాలని ఆశిస్తున్నారు. ఇండియన్ 2 సినిమా ఈవారం విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా రిజల్ట్ ను బట్టి కల్కి కలెక్షన్స్ ఆధారపడి ఉన్నాయి.