ఆ ముగ్గురి మ‌ధ్య 'దేవ‌ర' పార్టీ బిర్యానీ దాటి!

అభిమానుల స‌మ‌క్షంలో భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

Update: 2024-09-29 11:30 GMT

'దేవ‌ర' వ‌సూళ్ల పంచ్ కి బాక్సాఫీస్ బీట‌లు ప‌డుతోంది. రివ్యూల‌తో సంబంధం లేకుండా వ‌సూళ్ల సునామీ సృష్టిస్తోంది. సినిమాకి డివైడ్ టాక్ వ‌చ్చినా? వ‌సూళ్లు మాత్రం డౌన్ అవ్వ‌లేదు. స్టిల్ అదే దూకుడు కొన సాగిస్తోంది. దీంతో యూనిట్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్ల‌కు స‌మాయ‌త్తం అవుతుంది. అభిమానుల స‌మ‌క్షంలో భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

అక్టోబ‌ర్ 2న ఈ వేడుక నిర్వ‌హించేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. అందుకోసం వేదిక ఫైన‌ల్ అవ్వాల్సి ఉందిట‌. అయితే తార‌క్ త‌న స్నేహితుల‌కు ఓప్రామిస్ చేసాడు. గ్రాండ్ గా పార్టీ ఇస్తాన‌ని విశ్వ‌క్ సేన్..సిద్దు జొన్న‌ల గ‌డ్డ‌కు ప్ర‌చారం స‌మ‌యంలో చెప్పాడు. రిలీజ్కి ముందు బిర్యానీ ..సెప్టెంబ‌ర్ 27 త‌ర్వాత మీ ఇష్టం అంటూ ఓపెన్ అయిపోయారు. ఇప్పుడా ఇద్ద‌రు హీరోలు పార్టీకి రెడీ అయిపోవ‌చ్చు ఏమో.

టైగ‌ర్ రేపు హైద‌రాబాద్ లో ల్యాండ్ అవుతుంది. బియాండ్ పెస్ట్ కోసం ఫ్యామిలీతో అమెరికా వెళ్లిన తార‌క్ రేప‌టి క‌ల్లా హైద‌రాబాద్ చేరుకుంటారు. అనంత‌రం స‌క్స‌స్ సెల‌బ్రేష‌న్లు మొద‌లయ్యే అవ‌కాశం ఉంది. అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగే ఈవెంట్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే త‌న స్నేహితులిద్ద‌రికీ ఇచ్చిన మాట మాత్రం ముందు నిల‌బెట్టుకుంటారు. వాళ్ల‌తో పాటు తార‌క్ తో క్లోజ్ గా ఉండే ఇండ‌స్ట్రీ స్నేహితులంద‌ర్నీ కూడా ఆహ్వానించే అవ‌కాశం ఉంది.

స‌క్సెస్ విష‌యంలో నిర్మాత క‌ళ్యాణ్ రామ్ పుల్ ఖుషీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తొలి రోజు వ‌సూళ్లు అనంతర‌మే త‌మ‌లో జోష్ ని మీడియా ముఖంగా బ‌య‌ట పెట్టారు. ఆ స‌మ‌యంలో తార‌క్ పై త‌న ప్రేమ‌ను మ‌రోసారి చాటా చెప్పిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News