లెజెండ‌రి ద‌ర్శ‌కుడికి క‌మ‌ల్‌హాస‌న్ రేర్ గిఫ్ట్

ఆరోజుల్లోనే ఫిలింమేకింగ్ లో అసాధార‌ణ ప్ర‌యోగాలు చేసిన ద‌ర్శ‌కుడు సింగీతం.

Update: 2025-01-02 23:30 GMT

''పుష్ప‌క విమానం'' పేరుతో భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టి పాన్ ఇండియ‌న్ సినిమా తీసారు సింగీతం శ్రీ‌నివాస‌రావు. అస‌లు 'మాట‌'(భాష‌)తో పనే లేని చిత్రం తీసిన తొలి త‌రం దిగ్ధ‌ర్శ‌కుడు ఆయ‌న‌. లెజెండ‌రీ అనే ప‌దానికి మీనింగ్ అత‌డు. 90ల‌లోనే ఆయ‌న అడ్వాన్స్ డ్ థింకింగ్ తో సినిమాలు తీసారు. 'అపూర్వ సోద‌రులు' చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ ని పొట్టి వాడిగా చూపించిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. ఆరోజుల్లోనే ఫిలింమేకింగ్ లో అసాధార‌ణ ప్ర‌యోగాలు చేసిన ద‌ర్శ‌కుడు సింగీతం.

ఆదిత్య 369, భైర‌వ ద్వీపం వంటి క్లాసిక్ హిట్ చిత్రాల‌ను సింగీతం తెర‌కెక్కించారు. కెరీర్ లో చేసిన సినిమాలు త‌క్కువే అయినా ప్ర‌తి సినిమాతోను ప్ర‌యోగం చేసిన మ‌హ‌నీయుడు ఆయ‌న‌. పుష్పక విమానం, అపూర్వ సోద‌రులు వంటి సినిమాల్లో న‌టించిన క‌మ‌ల్ హాస‌న్ ఇప్పుడు గురువు సింగీతం రుణాన్ని ఉంచుకోలేదు. ఆయ‌న దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును త‌న‌దైన రీతిలో స‌న్మానించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన సేవలను భ‌విష్య‌త్ త‌రాలు గుర్తుంచుకునేలా డాక్యుమెంట‌రీని రూపొందించి విడుద‌ల చేసారు.

సింగీతం శ్రీనివాసరావు ప్రయాణాన్ని గుర్తుచేసే డాక్యుమెంటరీకి 'అపూర్వ సింగీతం' అని పేరు పెట్టారు. గ‌త డిసెంబ‌ర్ లో ఈ డాక్యుమెంట‌రీ విడుద‌లైంది. సింగీతం శ్రీనివాసరావు దిగ్గజ దర్శకుడు, స్క్రీన్ రైటర్, భారతీయ సినిమాపై ఆయ‌న ప్రభావం అసాధార‌ణ‌మైన‌ది. ముఖ్యంగా తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో చెరగని ముద్ర వేసిన ప్ర‌ముఖుడు. కె. బాలచందర్ దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్‌ని ప్రారంభించి 1983లో 'అపూర్వ సహోదరాంగల్‌'తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయ‌న యూనిక్ స్టైల్, స్క్రీన్ ప్లేతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి వంటి ప్రముఖ తారలతో ఆయ‌న‌ కలిసి పనిచేశారు.

Tags:    

Similar News