భారతీయుడు-2 ట్రైలర్.. మరోసారి కమల్ విశ్వరూపం

విలక్షణ నటుడు కమల్ హాసన్.. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే

Update: 2024-06-25 14:54 GMT

విలక్షణ నటుడు కమల్ హాసన్.. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండు వారాల వ్యవధిలో రెండు చిత్రాలతో అలరించనున్నారు. జూన్ 27వ తేదీన రిలీజ్ కానున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీలో యాస్కిన్ రోల్ పోషిస్తున్నారు కమల్. ఆ తర్వాత సూపర్ హిట్ మూవీ భారతీయుడు సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.

తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్లపై రూపొందుతున్న ఇండియన్-2 చిత్రంలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌ జే సూర్య‌, బాబీ సింహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మూవీ రిలీజ్ డేట్ ను జులై 12గా ప్రకటించిన మేకర్స్.. ప్రమోషన్స్ ను మోస్తరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.

"సేనాపతి తిరిగి వచ్చాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయుడు2 ట్రైలర్ ఇప్పుడు వచ్చింది. ఉత్కంఠ భరితమైన యాక్షన్, విజువల్స్ మిమ్మల్ని కట్టిపడేసేలా ఉన్నాయి" అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. స్వాతంత్ర్య సమరయోధుడు వీరశేఖరన్ సేనాపతిగా క‌మ‌ల్ హాసన్ క‌నిపించారు. 1996లో వచ్చిన ఫస్ట్ పార్ట్ లాస్ట్ లో దేశాన్ని విడిచి వెళ్ళిన సేనాపతి.. చేసిన వాగ్దానం ప్రకారం మళ్ళీ తిరిగి వచ్చినట్లు చూపించారు.

ట్రైలర్ ప్రకారం.. హీరో సిద్ధార్థ్ సినిమాలో ఓ స్టూడెంట్. సమాజంలో తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తూ ఉంటాడు. దీంతో అతడిని ఓ విషయంలో పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని ట్విట్టర్‌ లో 'ఆయన మళ్లీ రావాలి' అని అంతా ట్రెండ్ చేస్తారు. దీంతో సేనాపతి రీఎంట్రీ ఇస్తారు. అప్పుడు ఏం జరిగింది? ఆయన ఏం చేశారు? అనే కాన్సెప్ట్ చుట్టూ సినిమా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.

Read more!

అయితే ట్రైలర్ లో కమల్ హాసన్ విభిన్నమైన గెటప్స్ లో కనిపించారు. సింపుల్ గా చెప్పాలంటే.. తన విశ్వరూపం చూపించారు. ఈ వయసులో షర్ట్ లెస్ యాక్షన్ కూడా చేశారు. కమల్ హాసన్ యాక్టింగ్ సినిమాలో వేరే లెవెల్ లో ఉన్నట్లు అనిపిస్తోంది. ఆయన చెప్పిన డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి భారతీయుడు 2 ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగుతూ మూవీపై అంచనాలను పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News