'ప్రాజెక్ట్ -కె' ని కమల్ అలా ఎన్ క్యాష్ చేస్తున్నారా?
మరి ఈ సినిమాకి కమల్ ఎంత పారితోషికం తీసుకుంటున్నారు? అంటే 20 రోజులకు గాను 30 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
విశ్వనటుడు కమల్ హాసన్ ట్రెండ్ ని సెట్ చేయడమే కాదు..ట్రెండ్ ని ఫాలో అవుతారు. అందుకే ఇతర హీరోల చిత్రాల్లో సైతం భాగమవుతున్నారు. పాన్ ఇండియా చిత్రం ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తోన్న `ప్రాజెక్ట్ -కె`లో కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. కమల్ లాంటి అగ్ర నటుడు..గ్రేట్ లెజెండ్స్ తో పనిచేసిన నటుడు మరో నటుడి చిత్రంలో నటించడమంటే? సినిమాల పట్ల అతని ఫ్యాషన్ ఏ స్థాయిలో ఉంటుందనడానికి ఇదొక మచ్చు తునక.
మరి ఈ సినిమాకి కమల్ ఎంత పారితోషికం తీసుకుంటున్నారు? అంటే 20 రోజులకు గాను 30 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కమల్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా పారితోషికం చెల్లిస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా ఎదిగే క్రమంలో ఇతర హీరోల చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ తరహా పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చారు. మళ్లీ ఇంత కాలానికి ప్రభాస్ తో తెరను పంచుకుంటున్నారు. మరి సినిమాలో కమల్ రోల్ ఎలా ఉంటుందన్నది చూడాలి.
అయితే `ప్రాజెక్ట్ -కె` లో నటించడం కమల్ కి మరో రకంగానూ కలిసొస్తుంది. ఆయన నటిస్తోన్న `భారతీయుడు-2` లాంటి సినిమాని పాన్ ఇండియాలో పెద్ద ఎత్తున రీచ్ చేసే ప్రణాళిక కనిపిస్తోంది. ప్రస్తుతం `ప్రాజెక్ట్ -కె` టీమ్ తో అమెరికాలో ఉన్న శాన్ డియాగో కామిక్ కాన్ వేడుకలో ఆ సినిమాని ప్రమోట్ చేసుకునే అవకాశం ఈ రూపంలో దొరికింది. ప్రభాస్..రానా..అమితాబ్..దీపికా పదుకొణేలతో కలిసి జర్నీ చేస్తున్నారు.
అలాగే ఆగిపోయిన `శభాష్ నాయుడు` చిత్రాన్ని కూడా పట్టాలెక్కించబోతున్నట్లు వినిపిస్తోంది. ఇంకా మరికొన్ని ప్రాజెక్ట్ లు కమల్ లైన్ లో పెడుతున్నారు. `కెహెచ్ 233..234` సినిమాలు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ` కల్కీ 2898 ఏడీ` లాంటి భారీ డ్జెట్ చిత్రాలు తెర మీదకు తెస్తున్నారు. ఇందులో కొన్ని కమల్ సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నారు.