`ఇండియ‌న్-3`పై క‌మ‌ల్ క్లారిటీ!

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ఇండియన్-2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-03-26 06:24 GMT

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ఇండియన్-2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సిన సినిమా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వాయిదా ప‌డిన వైనం తెలిసిందే. అన్నిర‌కాల వివాదాలు దాటుకుని మ‌ళ్లీ పట్టాలెక్కిన త‌ర్వాత ఇండియ‌న్-3 ఉంటుంద‌ని కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. `ఇండియ‌న్ -2` కే ఇంత‌వ‌ర‌కూ మోక్షం లేదు.. కొత్త‌గా కంటున్యూటీ కూడా ఉంటుందా? అన్న విమ‌ర్శ‌నాస్త్రాలు తెర‌పైకి వ‌చ్చాయి.

శంక‌ర్ పై ఉన్న నెగిటివిటీ కార‌ణంగా ఇదంతా సాధ్య‌మ‌వుతుందా? అని చాలా మంది సందేహించారు. ఒక‌వేళ ఇండియ‌న్ -3 ప్ర‌క‌టించినా ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యే ప‌నేనా? శంక‌ర్ ఈసినిమా మొద‌లు పెట్టి పూర్తి చేయాలంటే మ‌రో ఐదేళ్లు అయినా ప‌డుతుంది. ఈలోపు 2030 కూడా వ‌చ్చేస్తుంద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కానీ ఇండియ‌న్ -3 పై శంక‌ర్-క‌మ‌ల్ హాస‌న్ చాలా సీరియ‌స్ గానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇంత‌కాలం గాలివార్త అని కొట్టిపారేసినా తాజాగా ఇండియ‌న్ -3 గురించి క‌మ‌ల్ హాస‌న్ రివీల్ చేసారు.

ఇండియ‌న్ -2 తో పాటు..ఇండియ‌న్ -3 చిత్రాన్ని కూడా పూర్తిచేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఇండియ‌న్ -2 నిర్మాణానంత‌ర ప‌నుల్లో ఉంద‌ని అదిపూర్తిక‌గానే `ఇండియ‌న్ -3` ప‌నులు మొద‌ల వుతాయ‌ని తెలిపారు. అందుకోసం ఎక్కువ‌గా స‌మ‌యం తీసుకొమ‌ని అన్నారు. క‌మ‌ల్ హాస‌న్ త‌న త‌దుప‌రి షెడ్యూల్ ప్ర‌క‌ట‌న‌లో భాగంగా `ఇండియ‌న్ -3` గురించి ఇలా రివీల్ చేసారు. అయితే `ఇండియ‌న్ -3` కంటున్యూటీ ఇప్పుడు చేయ‌క‌పోతే సాధ్యంకాని ప్రాజెక్ట్ అని తెలుస్తోంది.

`ఇండియ‌న్ -2` కోసం క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌త్యేకంగా స‌న్న‌ధం అయ్యారు. లుక్ ప‌రంగా ర‌క‌ర‌కాల గెట‌ప్ లు వేయాల్సి ఉంటుంది. అందుకు ప్రోస్తెటిక్ మ్యాక‌ప్ ని వినియోగిస్తున్నారు. అలాగే యాక్ష‌న్ స‌న్నివేశాలు అవ‌స‌ర‌మైన కొంత శిక్ష‌ణ కూడా తీసుకున్నారు. `ఇండియ‌న్ -3` కంటున్యూటీలో కూడా ఓ పాత్ర అలాగే ఉంటుందిట‌. ఈ సంద‌ర్భంగానే `ఇండియ‌న్ -3`ని పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండా ప్లాన్ చేస్తున్న‌ట్లు చిత్ర వ‌ర్గాల నుంచి కూడా లీకైంది. మొత్తానికి క‌మ‌ల్ అండ్ కో ఈసారి ప్రీ ప్లాన్డ్ గానే బ‌రిలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News