తండ్రి కూతురు ప్రాజెక్ట్ గురించి క్లారిటీ..!
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పని అయిపోయిందని అంతా భావిస్తున్న సమయంలో విక్రమ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పని అయిపోయిందని అంతా భావిస్తున్న సమయంలో విక్రమ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ వరుస సినిమాలకు సిద్ధమవుతున్నాడు.
విక్రమ్ ఇచ్చిన కమర్షియల్ సక్సెస్ జోష్ తో కమల్ హాసన్ సొంత బ్యానర్ లో పరిస్థితి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఒక కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు శృతి హాసన్ కూడా వర్క్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.
చాలా మంది కమల్ హాసన్ మరియు శృతిహాసన్ కలిసిన నటించబోతున్నారని భావనకు వచ్చారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమా సంగీత బాధ్యతలను శృతిహాసన్ చూసుకోబోతుందట. అంతే తప్ప ఈ సినిమాలో ఆమె నటించడం లేదని సమాచారం అందుతుంది.
ఆర్కే ఎఫ్ ఫై బ్యానర్ లో రూపొందబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఇటీవల కమల్ హాసన్ టీమ్ మెంబర్స్ ప్రకటించారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు శృతిహాసన్ సమాధానాలు ఇస్తూ ఈ సినిమా గురించి స్పందించింది.
ఇటీవల ప్రకటించిన సినిమా ఒక మ్యూజికల్ ప్రాజెక్ట్ అని దానికి సంబంధించిన వివరాలు అతి త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొంది. ఆ సినిమా కోసం చాలా థ్రిల్లింగ్ గా వెయిట్ చేస్తున్నట్లు కూడా ఆమె పేర్కొంది.
గతంలో కమల్ హాసన్ నటించిన ఈనాడు సినిమా కోసం శృతిహాసన్ టెక్నీషియన్ గా వర్క్ చేసింది. ఇప్పుడు మళ్లీ కమల్ హాసన్ కోసం సంగీత దర్శకురాలిగా మారబోతుంది. మల్టీ టాలెంటెడ్ అయినా శృతిహాసన్ భవిష్యత్తులో తండ్రి కమల్ హాసన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలని ఉందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.