ఏంది 'కల్కి' గ్లింప్స్ లో కమల్ ఉన్నారా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 'కల్కి 2989 AD'గా టైటిల్ ఖరారు చేశారు. ప్రఖ్యాత శాన్ డీగో కామిక్ ఈవెంట్ లో ఆవిష్కరించారు.

Update: 2023-07-23 14:06 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 'కల్కి 2989 AD'గా టైటిల్ ఖరారు చేశారు. ప్రఖ్యాత శాన్ డీగో కామిక్ ఈవెంట్ లో ఆవిష్కరించారు. అయితే గ్లింప్స్ లో స్టోరీని రివీల్ చేయలేదు. కేవలం ప్రధాన పాత్రల్ని మాత్రమే చూపించారు.

గ్లింప్స్ చూసిన వారు ప్రభాస్ కల్కిగా కనిపించబోతున్నారని అర్థం చేసుకున్నారు. ఈ కథంతా 2989 సంవత‍్సరంలో జరగబోతుందని ఓ అంచనాకు వచ్చారు. అశ్వత్థామ పాత్రను అమితాబ్ పోషిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆయన ముసుగు కప్పి చూపించినా గుర్తుపట్టారు. విలన్ గ్యాంగ్ బంధించిన వాళ్లలో దీపిక పదుకొణె ఉన్నట్లు చూపించారు. మిగతా పాత్రలు కూడా చూపించారు. అయితే ఈ 75 సెకన్ల పాటు ఉన్న ఈ గ్లింప్స్ లో కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదు.

దీంతో అభిమానులంతా 'కమల్ హాసన్ ఎందుకు చూపించలేదు?', 'ఆయన్ను చూపించి ఉంటే బాగుండేది', 'ఆయన ఎక్కడా?' అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ ను ప్రశ్నించారు. అయితే దీనికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. 'గ్లింప్స్ మొత్తంలో కమల్ ఉన్నారు. కానీ మీకు తెలియదు' అని బదులు చెప్పారు. 'ఆయన పాత్రను మిస్టరీగా ఉంచాం' అంటూ తెలిపారు. కమల్ హాసన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. నాగ్ అశ్విన్ విజన్ ఎంతో అద్భుతం. మీకు సర్ ప్రైజ్ ఇచ్చేందుకే దాచారు అంటూ చెప్పారు. దీంతో ప్రేక్షకుల బుర్ర తిరిగిపోయింది.

ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారం.. ఈ చిత్రంలో ప్రభాస్ ఇందులో డబుల్ రోల్ చేయనున్నారని అంటున్నారు. ఇందులో ఒకరు హీరోగా మరొకరు విలన్ గా కనిపిస్తారని అనుకుంటున్నారు. కమల్ హాసన్ కూడా ప్రతినాయకుడిగా కనిపిస్తారని చెబుతున్నారు. ఏదీ ఏమైనా ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. అసలు నిజం తెలియాలంటే 'కల్కి' థియేటర్లలోకి వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

ఇక సినిమా విషయానికొస్తే.. ప్రపంచం మొత్తం అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఓ శక్తి ఉదయించి, చీకటిని ఎలా అధిగమించింది, అందుకు కారణమైన రాక్షసుల్ని పారదోలి కొత్త వెలుగుల్ని ఎలా తీసుకొచ్చింది, అసలా శక్తి ఏమిటి? వంటి విషయాలతో 'కల్కి 2898 ఎ.డి' తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ దాదాపు రూ.500కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2024 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.

Tags:    

Similar News