ఆ ట్రైలర్ కన్నా ఇది సూపర్ హై ఇచ్చిందిగా..?
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్నారని చెప్పొచ్చు.
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్నారని చెప్పొచ్చు. విక్రం ముందు వరకు కమల్ సినిమాలకు ఆయన చేస్తున్న పాత్రలకు పెద్దగా బజ్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో విక్రం సినిమా వచ్చిందో ఆ సినిమా కమల్ ని తిరిగి ఫాం లోకి తెచ్చింది. ఆ సినిమా తర్వాత కమల్ దూకుడు ఒక రేంజ్ లో ఉంది. లేటెస్ట్ గా ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 AD సినిమాలో సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ అదరగొట్టారు. ఏదైనా కొత్తగా చేయాలని ఉంటే దానికి తన ఫుల్ సపోర్ట్ అందించే కమల్ హాసన్ కల్కి యాస్కిన్ పాత్రలో సూపర్ ట్రీట్ ఇచ్చాడు.
చేసింది నెగిటివ్ రోలే అయినా తన లుక్, యాక్టింగ్ తో వారెవా అనిపించాడు. ఐతే కల్కి మొదటి పార్ట్ లో యాస్కిన్ పాత్ర చాలా చిన్నది కానీ ఉన్నంత సేపు కమల్ హాసన్ వీర లెవెల్ లో కనిపించారు. సినిమాకు హై ఇచ్చిన మూమెంట్ లో సుప్రీం యాస్కిన్ రోల్ కూడా ఒకటి. ముఖ్యంగా ఎండింగ్ లో కమల్ సార్ సూపర్ అనిపించాడు. ఐతే కల్కి సినిమాలో ఆయన రోల్ చూసిన ఆడియన్స్ నెక్స్ట్ మంత్ కమల్ లీడ్ రోల్ లో చేస్తున్న ఇండియన్ 2 మీద అసంతృప్తిగా ఉన్నారు.
రీసెంట్ గా కమల్ హాసన్ శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ చూసిన వారంతా కూడా కమల్ హాసన్ లుక్స్ మీద డౌట్ పడుతున్నారు. ఎంత మేకప్ వేసినా సరే ఎక్కడో తేడా కొడుతుందని అనిపించింది. ఐతే ఇండియన్ 2 ట్రైలర్ ఇవ్వలేని హై కల్కి సినిమాలో కమల్ చేసిన సుప్రీం యాస్కిన్ పాత్రతో ఇచ్చిందని కమల్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. కచ్చితంగా కల్కి ఎఫెక్ట్ కమల్ నెక్స్ట్ సినిమాపై ఉంటుంది.
ఎప్పుడో పాతికేళ్ల క్రితం తీసిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా అభారీ బడ్జెట్ తో శంకర్ ఇండియన్ 2 తెరకెక్కించారు. ఈ సినిమా విజువల్స్ పరంగా శంకర్ మార్క్ కనిపిస్తున్నా ఇలాంటి సామాజిక స్పృహతో వచ్చే సినిమాలు ఇప్పుడు ఆడియన్స్ చూసి ఆదరిస్తారా అన్న డౌట్ అయితే ఉంది. ఏది ఏమైనా కల్కి లో కమల్ నటించడం ఆయనకు ఒక సినిమా చేసిన అనుభవమే కానీ ఇలాంటి గ్రాండియర్ ఉన్న సినిమాలో డిఫరెంట్ రోల్ లో కమల్ ని చూడటం ఆడియన్స్ కు మంచి ఐ ఫీస్ట్ లా అనిపించింది. కల్కి 2 లో కమల్ సీన్స్ ఇంకాస్త పెంచితే మాత్రం వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు.