కల నెరవేర్చుకున్న స్టార్‌ హీరోయిన్‌

తాను చాలా కాలంగా అనుకుంటున్న రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Update: 2025-02-05 16:30 GMT

బాలీవుడ్ హీరోయిన్‌, ఎంపీ కంగనా రనౌత్ ఈమధ్య కాలంలో తన ఫైర్ బ్రాండ్‌ కామెంట్స్‌తో వార్తల్లో నిలవడంలేదు. కానీ ఆమె ఎంపీగా చేస్తున్న పనుల వల్ల, ఆమె రాజకీయంగా చేస్తున్న వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఈసారి ఆమె తన సొంత మొదటి ఫుడ్ బిజినెస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా వార్తల్లో నిలిచింది. హీరోయిన్‌గా సినిమాలు కాస్త తగ్గించిన కంగనా రనౌత్‌ ఈమధ్య కాలంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే పనిలో పడింది. తన ఎమర్జెన్సీ సినిమా విడుదల తర్వాత మరోసారి కంగనా రనౌత్ వార్తల్లో నిలిచారు. తాను చాలా కాలంగా అనుకుంటున్న రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

తన సొంత ప్రాంతం హిమాచల్‌ ప్రదేశ్‌లో కంగనా రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసింది. హిమాలయాల్లో అద్భుతమైన ఇంటీరియర్‌తో చూడగానే వావ్ అనిపించేంత అందంగా కంగనా రనౌత్‌ రెస్టారెంట్‌ని ఏర్పాటు చేసింది. 'ది మౌంటైన్‌ స్టోరీ' అనే పేరుతో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె రెస్టారెంట్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేయడం ద్వారా అందరూ ఈ రెస్టారెంట్‌ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. చుట్టూ మంచు పర్వతాలు అందంగా ఉండగా, మధ్యలో ఈ రెస్టారెంట్‌ అంతకు మించి అందంగా కనిపించడం విశేషం.

కంగనా రనౌత్‌ ఈ రెస్టారెంట్‌ గురించి స్పందిస్తూ... నేను చిన్నప్పటి నుంచి కంటున్న కలను నెరవేర్చుకున్నాను. హిమాలయాల పక్కన నా చిన్న కేఫ్‌. ది మౌంటైన్‌ స్టోరీ.. ఇది ఒక ప్రేమ కథ అన్నట్లుగా వీడియో తో పాటు కంగనా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. చిన్నప్పటి నుంచి ఫుడ్‌ బిజినెస్‌లో అడుగు పెట్టాలని కోరుకున్నాను అని, ఇన్నాళ్లకు తన కల నెరవేరింది అంటూ కంగనా పోస్ట్‌ పెట్టడంతో ఆమె అభిమానులతో పాటు నెటిజన్స్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రెస్టారెంట్‌ను ఫిబ్రవరి 14న హిమాచల్‌ ప్రదేశ్‌ సాంప్రదాయ వంటకాలతో ప్రారంభించబోతున్నట్లు కంగనా తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఇండస్ట్రీలో స్టార్‌ హీరోల్లో దాదాపు అందరితోనూ విభేదాలు ఉన్న కంగనా రనౌత్‌ ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ వస్తుంది. ఎక్కువగా ఆమె సొంత బ్యానర్‌లోనే సినిమాలను చేస్తూ వస్తుంది. ఎమర్జెన్సీ సినిమాతో తన ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టాలని భావించిన కంగనా కు పెద్దగా వర్కౌట్ కాలేదు. పొలిటికల్‌ డ్రామాగా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేదు. ఎంపీగా ఉన్న కారణంగా కంగనా తదుపరి సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదు. ఎంపీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటాను అంటూ గతంలో ప్రకటించింది. సొంత బిజినెస్ ప్రారంభించిన కంగనా పెళ్లి ప్రకటన ఎప్పుడు చేస్తుందో, కొత్త సినిమా గురించి ఎప్పుడు ప్రకటన చేస్తుంది అనేది చూడాలి.

Tags:    

Similar News