హాట్ బేబ్‌లు 6 ప్యాక్‌ల వెంట ప‌డ‌తారు: కంగ‌న‌!

దక్షిణాది సినిమాలు హిందీ సినిమాలను ఎందుకు మించిపోతున్నాయనే డిబేట్‌లో పాల్గొన్న‌ కంగనా రనౌత్.. బాలీవుడ్ హీరోల వాల‌కాన్ని ప్ర‌శ్నించింది.

Update: 2024-12-14 18:38 GMT

ఇటీవ‌ల హిందీ చిత్ర‌సీమ‌ను డామినేట్ చేసే సినిమాలు టాలీవుడ్ నుంచి వస్తున్నాయి. వ‌రుస‌గా 1000 కోట్ల క్ల‌బ్ సినిమాలు సౌత్ నుంచే విడుద‌ల‌వుతుండడం హిందీ సినీప్ర‌ముఖుల‌కు జీర్ణం కావ‌డం లేదు. చాలామంది విశ్లేష‌కులు బాలీవుడ్ ఫిలింమేక‌ర్స్ సౌత్ ని చూసి నేర్చుకోవాల‌ని సూచిస్తున్నారు. బాలీవుడ్ బ‌డా హీరోలు సైతం దీనికి అంగీక‌రించాల్సిన ప‌రిస్థితి ఉంది.

ఇదే త‌ర‌హాలో పుష్ప‌రాజ్ ని, ద‌క్షిణాది సినిమాని పొగిడేస్తూ హిందీ చిత్ర‌నిర్మాత‌ల్ని తిట్టేసింది క్వీన్ కంగ‌న ర‌నౌత్. దక్షిణాది సినిమాలు హిందీ సినిమాలను ఎందుకు మించిపోతున్నాయనే డిబేట్‌లో పాల్గొన్న‌ కంగనా రనౌత్.. బాలీవుడ్ హీరోల వాల‌కాన్ని ప్ర‌శ్నించింది. హాట్ బేబ్‌లు 6 ప్యాక్ యాబ్స్ వెంట ప‌డ‌తారని కామెంట్ చేసింది. చాలా హిందీ సినిమాలు వాస్తవికత నుండి ఎక్కువగా డిస్‌కనెక్ట్ కావడం వ‌ల్ల‌నే ఈ ప‌రిస్థితి త‌లెత్తుతోంద‌ని కూడా కంగ‌న విమ‌ర్శించింది.

అల్లు అర్జున్ పుష్ప ఫ్రాంచైజీని బాలీవుడ్‌లోని వ్యాపార పరిస్థితులతో పోల్చి భారీ విజయాన్ని సాధించడానికి గల కారణం చెప్పాల్సిందిగా కంగనను ప్ర‌శ్నించారు. నిజానికి 'పుష్ప 2' విజయాన్ని కంగనా డీకోడ్ చేసింది. చిత్ర‌క‌థానాయ‌కుడు రోజువారీ వేతన కార్మికుడి పాత్రను ఎలా పోషించాడో నొక్కి చెప్పారు. ప్ర‌మాణాల ప‌రంగా చూస్తే.. బాలీవుడ్ అస‌లు ప్రధాన స్రవంతి సినిమా కాదని కంగ‌న షాకింగ్ కామెంట్ చేసారు. ''మన సినిమాలను భారతీయ చలనచిత్ర పరిశ్రమగా నిర్వచించాలి. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులను ఉద్దేశించిన ఒక పరిశ్రమ'' అని కంగనా అన్నారు.

స్టార్ హీరోల‌కు కంగ‌న చుర‌క‌లు:

''బాలీవుడ్‌ మ‌నుషులు బుడగలో జీవిస్తారు. వారితో నేను ఎదుర్కొనే ప్ర‌ధాన‌ సమస్యల‌లో ఇది ఒక‌టి.

వీళ్లు బుడ‌గ నుండి బయటకు రావాలనుకోరు. వీరికి కావాల్సిందల్లా జిమ్‌కి వెళ్లడం, ప్రొటీన్ షేక్స్ తీసుకోవడం, ఇంజెక్షన్లు తీసుకోవడం... వారికి వాస్తవికతతో ఎలాంటి సంబంధం లేదు'' అని కంగ‌న‌ చెప్పింది. పుష్ప 2లో అల్లు అర్జున్ పోషించిన పాత్రను చేసేందుకు బాలీవుడ్ హీరోల ఎవరూ అంగీకరించరు.. అని వ్యాఖ్యానించింది.

పుష్ప: ది రైజ్ 2021లో విడుదలై పాన్-ఇండియాలో ఘ‌న‌విజ‌యం సాధించింది. ఇప్పుడు పుష్ప 2 ఏకంగా 1000 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్టింది. హిందీ మాట్లాడే ప్ర‌తి చోటా పుష్ప‌రాజ్ పేరు మార్మోగుతోంది. అల్లు అర్జున్ ఇమేజ్ ఉత్త‌రాదిన ప‌రాక‌ష్ఠ‌కు చేరుకుంది. 'పుష్ప 3: ది ర్యాంపేజ్' కోసం సుకుమార్ స్క్రిప్టును రెడీ చేయాల్సి ఉంది.

Tags:    

Similar News