డార్క్ వెబ్‌తో సినీలింకుల‌పై కంగ‌న లీక్స్

Update: 2024-02-24 17:26 GMT

తేనెతుట్ట‌ను ప‌ట్టి క‌దిపితే ఎలా ఉంటుంది? సింహానికైనా తేనెటీగ‌ల కాటు మంట పుట్టిస్తుంది. అయితే త‌న‌కు ఇలాంటి ఈగ‌లు ఎన్ని క‌రిచినా ఖాత‌రు చేయ‌న‌ని అంటోంది క్వీన్ కంగ‌న‌. బాలీవుడ్ లో చాలా మంది ప్ర‌ముఖుల తాట ఒలిచిన క్వీన్ కంగ‌న, ఇప్పుడు మ‌రోసారి పెద్ద తేనెతుట్ట‌నే క‌దిపింది.

పరిశ్రమకు చెందిన పెద్దలు అక్రమాలకు పాల్పడుతున్నారని, వాటిని కేంద్రం బయటపెట్టాలని కొంద‌రు సినీపెద్ద‌ల‌పై క్వీన్ కంగ‌న‌ ఆరోపించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో TRAI తాజా వార్తలను షేర్ చేయ‌డం ద్వారా అంతర్గత వ్యక్తులు చట్టవిరుద్ధమైన విషయాలలో పాల్గొంటున్నారని కంగ‌న‌ పేర్కొన్నారు. ఇక్కడ నుండి ఫోన్ నంబర్‌తో పాటు కాల్ ఎవరి IDలో ఉందో ఆ వ్యక్తి పేరును ప్రదర్శిస్తుందని తెలిపింది. నియమం ప్రకారం ఫోన్ నంబ‌ర్ లు సేకరించబడ్డాయి.

కంగనా ప్ర‌భుత్వ చొర‌వ‌ను ప్రశంసిస్తూ, ``అద్భుతం!! కేంద్రం డార్క్ వెబ్ గురించి కూడా ఏదైనా చేయాలి, చాలా మంది సినీ ప్రముఖుల కార్య‌క‌లాపాలు దానితో ముడిపడి ఉన్నాయి. అక్కడి నుండి అక్రమ వస్తువులను వినియోగించడమే కాకుండా వాట్సాప్ స‌హా ప్రతి ఒక్కరి కమ్యూనికేషన్‌లను హ్యాక్ చేస్తున్నారు. మెయిల్స్ కూడా దొరికిపోతున్నాయి`` అని వెల్ల‌డించారు.

కంగనా రనౌత్ పరిశ్రమ గురించి దాగి ఉన్న‌ వాస్తవాలు నిజాలను మాట్లాడటానికి ఎప్పుడూ వెనుకాడదు. ఇంత‌కుముందు బంధుప్రీతి చర్చను ప్రారంభించినది క్వీన్. కంగనాకు ఇండస్ట్రీలో స్నేహితుల కంటే శత్రువులు ఎక్కువే కానీ తాను మాత్రం ఎప్పుడూ ధీమాగా ఉంది. భారతీయ సినిమా చరిత్రలో క్వీన్ పేరు ఎప్ప‌టికీ తప్పకుండా గుర్తుండిపోతుంది.

కొద్ది రోజుల క్రితం తన భర్త అక్షయ్ కుమార్‌ను సరదాగా ఎగతాళి చేసిన ట్వింకిల్ ఖన్నాను తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది కంగ‌న‌. ట్వింకిల్ భర్తలను పాలిథిన్ బ్యాగ్‌లతో పోల్చింది. ఇది కంగ‌నకు మింగుడు పడలేదు. దీంతో ట్వింకిల్ పై క్వీన్ విరుచుకుపడింది. ``మ‌గవాళ్లను పాలిథిన్ బ్యాగ్‌లు అని పిలిచే ఈ ప్రివిలేజ్డ్ ఆకతాయిలు ఏమిటి కూల్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు? వెండి చెంచాతో పుట్టిన నేపో పిల్లలు, బంగారు పళ్ళెంలో సినిమా కెరీర్లు ఇచ్చారు. దానికి క‌చ్చితంగా న్యాయం చేయలేకపోయారు. కనీసం వారు మాతృత్వం నిస్వార్థతలో కొంత ఆనందం పరిపూర్ణతను కనుగొనగలరు. అది వారి విషయంలో శాపంగా కూడా కనిపిస్తుంది. వారు ఖచ్చితంగా ఏమి కోరుకుంటున్నారు? అది స్త్రీవాదమా?`` అంటూ తీవ్రంగా విరుచుకుప‌డింది. ఒక ర‌కంగా ట్వింకిల్ ఖ‌న్నా స్త్రీ వాదాన్ని ఆక‌తాయిత‌నాన్ని కంగ‌న ఖండించారు.

Tags:    

Similar News