క్వీన్ కంగన భయపడుతోంది.. కారణం తెలిస్తే షాక్!
కరణ్ జోహార్ ఇంతకుముందు ఓ మీడియా ఎదుట తాను 'ఎమర్జెన్సీ' మూవీని చూడాలనుకుంటున్నానని అన్నారు
క్వీన్ కంగన భయపడింది! తనని భయపెట్టింది ఎవరో తెలుసా? కరోనా వైరస్ కాదు.. హృతిక్ రోషన్ కానే కాదు.. భట్స్ అసలే కాదు.. ఇంతకీ ఎవరు? అంటే.. కరణ్ జోహార్. తన జీవితంలో ప్రధాన శత్రువు. అయితే అతడు భయపెట్టడానికి ఎంచుకున్న మార్గమే వింత గొలుపుతోంది.
కరణ్ జోహార్ ఇంతకుముందు ఓ మీడియా ఎదుట తాను 'ఎమర్జెన్సీ' మూవీని చూడాలనుకుంటున్నానని అన్నారు. తన బద్ధవిరోధి అయిన కంగన సినిమాపై అతడు ఆసక్తిని కనబరచడం ఆశ్చర్యపరిచింది. ''ఆ మూవీని చూస్తానని చెప్పడానికి సంతోషిస్తున్నాను..'' అని కరణ్ అన్నాడు. అయితే దీనికి వెంటనే కంగన నుంచి అంతే వేగంగా రిప్లయ్ వచ్చింది. ''ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది'' అని తొలిగా వ్యాఖ్యానించింది. అందుకు కారణం కూడా విశదపరిచింది. ''హ హ చివరిసారిగా అతడు (కరణ్) 'మణికర్ణిక'ను చూసేందుకు ఉత్సాహంగా ఉన్నానని చెప్పినప్పుడు.. ఆ చిత్రం విడుదలైన వారాంతంలో నాపై అధ్వాన్నమైన విష ప్రచారం పడగ విప్పింది'' అని కంగనా రాసింది. ఇప్పుడు కరణ్ మళ్లీ ఉత్సాహంగా ఉన్నందున తాను భయపడుతున్నానని చెప్పింది. మరోసారి తన సినిమాపై కరణ్ విష ప్రచారం చేస్తాడనే భయాన్ని వ్యక్తం చేసింది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాలనలో భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సంగతి తెలిసిందే. నాటి చీకటి కాలంపై నిజఘటనలతో తెరకెక్కిన చిత్రమిది. కంగనా రనౌత్ ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు.. వీడియో గ్లింప్స్ కి అద్భుతమైన స్పందన లభించింది. ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని కంగన స్వీయనిర్మాణంలో తెరకెక్కిస్తోంది. తానే దర్శకురాలు.. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, సతీష్ కౌశిక్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 24 నవంబర్ 2023న ఘనంగా విడుదల చేయనున్నారు.