'చంద్రముఖి-2' కోసం కంగనకి 22 కోట్లా?
'చంద్రముఖి-2' సినిమాతో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే
'చంద్రముఖి-2' సినిమాతో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. చంద్ర ముఖి పాత్రని తానే స్వయంగా కోరుకుంది. దర్శకుడు పి. వాసుకి ఫోన్ చేసి ఆ పాత్రలో తానే నటిస్తానని కోరడంతో ఆమె కోరిక మేరకు అవకాశం ఇచ్చారు. కంగన ఎంత పెద్ద నటి అన్నది చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో కోట్ల వసూళ్లు తెచ్చే నాయిక. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతో తనకంటూ ఓబ్రాండ్ ఐడెంటిటీనీ సంపాదించింది. అలాంటి నటి చంద్రముఖి కోసం ఓ మెట్టు దిగొచ్చింది.
మరి ఈ సినిమాకి కంగన తీసుకుంటున్న పారితోషిక ఎంతో తెలుసా? అక్షరాల 22 కోట్లు అని సమాచారం. ఆమె స్థాయిని ఏమాత్రం తగ్గించకుండా ఈ పారితోషికం చెల్లించారుట. తాను నటిస్తానని స్వయంగా అడిగింది కదా? అన్న విషయాన్ని ఏమాత్రం అడ్వాంటేజ్ గా తీసుకోకుండా ఆమె మార్కెట్ ని బట్టి దర్శక-నిర్మాతలు అంత మొత్తం చెల్లిస్తున్నట్లు సమాచారం. అయితే పారితోషికం గురించి కంగన ఎక్కడా చర్చించలేదుట. ఇంత ఇవ్వండని అడిగింది లేదుట.
ఈ రెమ్యునరేషన్ వ్యవహరంతా కంగన పైనాన్స్ టీమ్ చూసుకుందిట. నేరుగా అకౌంట్ లోకి సింగిల్ పేమెంట్ గా క్రెడిట్ చేసిన తర్వాత నిర్మాతలు కంగన టీమ్ కి ఈ విషయం చేరవేసారుట. అటుపై కంగన నిర్మాతలకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. హీరోలతో సమాన పారితోషికాలు మాకెందుకు ఇవ్వరని కంగన బాలీవుడ్ లో ఎలాంటి ఫైట్ చేస్తుందో తెలిసిందే. పురుషాధిక్య ఇండస్ట్రలీలో మహిళా నటుల్ని తొక్కేస్తున్నారని గొంతెత్తిన సందర్భాలెన్నో ఉన్నాయి.
కానీ 'చంద్రముఖి-2' విషయంలో వ్యవహమరంతా కామ్ గా జరిగిపోయింది. ప్రస్తుతం కంగన బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే కంగన తెలుగులో 'ఏక్ నిరంజన్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా ప్రభాస్ నటిచంగా పూరి జగన్నాధ్ తెరకెక్కించారు.