కంగనపై డాడీ కేకలు వేసిన వేళ!
క్వీన్ కంగన రనౌత్ బాలీవుడ్ లో ఎంత పెద్ద హీరోయిన్ అన్నది చెప్పాల్సిన పనిలేదు.
క్వీన్ కంగన రనౌత్ బాలీవుడ్ లో ఎంత పెద్ద హీరోయిన్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్లలోనే తానో బ్రాండ్ గా కొనసాగుతుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయింది. అటుపై సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించింది. అలాగే సొంతంగా కథలు రాసి సినిమాలకు దర్శకత్వం వహించడం నేర్చుకుంది. ఇప్పుడు రాజకీయాలు కూడా చేస్తోంది. ప్రస్తుతం మండి నియోజక వర్గం నుంచి బీజేపీ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇలా సినిమా-రాజకీయం రెండు రంగాల్లోనూ సక్సెస్ అయింది. అలాంటి సక్సెస్ పుల్ డాటర్ పై డాడ్ ఆగ్రహంతో కేకలు వేసారా? కంగన ప్రవర్తనా తీరు నచ్చకే ఆ పనిచేసారా? అంటే అవుననే తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే...` కంగన `గ్యాంగ్ స్టర్` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయం లో దర్శకుడు అనురాగ్ బసు, కంగనా ఓ కెఫెలో కలుసుకున్నారని, అందుకే ఛాన్స్ ఇచ్చాడనటి అప్పట్లో మీడియా కథనాలు వెడెక్కించాయి.
తాజాగా ఆ రూమర్ గురించి కంగన వివరణ ఇచ్చింది. `అందులో నిజం లేదు. ఆడిషన్ ద్వారానే ఎంపిక చేసారు. కాకపోతే సినిమా ప్రమోషన్ కోసం అలా ఓస్టంట్ క్రియేట్ చేసారు. బాలీవుడ్ లో ఏం జరుగుతుంది? సినిమా ప్రపంచం ఎలా ఉంటుందన్నది? మా ఇంట్లో వాళ్లకు..మానాన్నకు అస్సలు అవగాహన లేదు. కానీ అప్పటికే అనురాగ్ బసు తీసిన `మర్డర్` సినిమా గురించి తెలుసు.
ఆ సినిమా తీసిన వ్యక్తే నాకు అవకాశం ఇచ్చాడని తెలిసి నాన్న నాపై కేకలు వేసారు. వెంటనే ఇంటికొచ్చేమని ఆదేశాలిచ్చారు. కానీ డాడ్ ని ఎలాగూ అప్పుడు ఒప్పించాను. నిజానికి ఆ పాత్ర కోసం నాకన్నా ముందు చిత్రాంగదాని సెలక్ట్ చేసారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా తిరిగి మళ్లీ ఆ పాత్ర నాదగ్గరకే వచ్చింది` అని తెలిపింది.