ఎన్నికల తర్వాత అమ్మడు తగ్గేదేంలే!
ఈ నేపథ్యంలో కంగన సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసిందని..ఇక సినిమాలు చేయదని రెండు మూడు రోజులుగా ప్రచారం అంతకంతకు వెడెక్కిపోతుంది.
బాలీవుడ్ నటి కంనగా రనౌత్ బీజేపీ తరుపున హిమాచల్ ప్రదేశల్ లోని మండి నియోజక వర్గం నుంచి ఎంపీ అభ్యర్ధిగా ఎన్నికల బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. గెలుపే లక్ష్యంగా ఆ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కంగన పొలిటికల్ స్పీచ్..రాజకీయాలపై ఆమెకున్న ఆసక్తి చూసి! కంగన ఇక సినిమాలు చేస్తుందా? అన్న సందేహం కూడా బాలీవుడ్ మీడియా లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కంగన సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసిందని..ఇక సినిమాలు చేయదని రెండు మూడు రోజులుగా ప్రచారం అంతకంతకు వెడెక్కిపోతుంది.
తోటి సినిమా నటులంతా మ్యాకప్ కి దూరమై పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగడంతో కంగన కూడా అదే పనిచేస్తుందని..ఇకపై ప్రజా క్షేత్రంలోనే ఉంటుందని అభిమానులు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రచారాలన్నింటిని కంగన కొట్లిపారేసింది. ఎన్నికల తర్వాత యధావిధిగా హీరోయిన్ గా కొనసాగుతానని తెలిపింది. `నేను సినిమాలు మానేస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇండస్ట్రీలో నేను చేయాల్సిన సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. త్వరలో ఎమర్జెన్సీ విడుదలవుతుంది.
ఆ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది` అని తెలిపారు. దీంతో కంగన బాలీవుడ్ కంబ్యాక్ పై స్పష్టత వచ్చినట్లు అయింది. ఇప్పటికే కంగన హిందీ...తమిళ్ లో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రానికి సైన్ చేసింది. ఎన్నికల కారణంగా ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు. అలాగే `ఎమెర్జెన్సీ` చిత్రాన్ని జూన్ 14న రిలీజ్ చేయనుంది. ఎన్నికల అనంతరం కంగన ఆ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది.
కమిట్ అయిన చిత్రాల్ని ఆన్ సెట్స్ కి తీసుకెళ్లనుంది. కంగన చాలా కాలంగా సోలో నాయికగానే సత్తా చాటాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఉమెన్ సెంట్రిక్ కథల్నే ఎంపిక చేసుకుంటుంది. కానీ స్టోరీల వైఫల్యంతో తాను బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాలు రావడం లేదు. తాజా సినిమా ఎమర్జెన్సీ పై మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందిరాగాంధీ పాత్రలో ..ఆహార్యంలో కంగన ఒదిగిన వైనం విమర్శకుల ప్రశంసలు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే.