ఇది 1000 కోట్ల సినిమా అవుతుందా?

దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Update: 2024-05-07 04:25 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, యాక్షన్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శివ కాంబినేషన్ లో సిద్ధం అవుతోన్న భారీ బడ్జెట్ మూవీ కంగువ. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రెజెంట్, ఫాస్ట్ కలయికలో కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది.

సూర్య ఈ చిత్రంలో రెండు భిన్నమైన క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడు. అందులో ఒక పాత్రలో పవర్ ఫుల్ ట్రైబల్ వారియర్ కనిపిస్తున్నాడు. మరో పాత్ర ప్రెజెంట్ లో ఉండబోతోంది. ఈ క్యారెక్టర్ సైంటిస్ట్ తరహాలో ఉంది. ఈ రెండు పాత్రల మధ్య కథాంశంతో కంగువ మూవీ ఉంటుందంట. 2 పార్ట్స్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.

కంగువ పార్ట్ 1 ఈ ఏడాదిలోనే రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా సిల్వర్ స్క్రీన్ పై దర్శకుడు శివ ఆవిష్కరిస్తున్నారు. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే యాక్షన్ ప్యాక్డ్ మూవీ కావడంతో సినిమాలో గూస్ బాంబ్స్ సీక్వెన్స్ చాలా ఉంటాయంట.

ఈ చిత్రంలో బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తూ ఉండగా, దిశా పటాని హీరోయిన్ గా కనిపిస్తోంది. జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. పాన్ ఇండియా కల్చర్ వచ్చిన తర్వాత ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సౌత్ సినిమాల ఆధిపత్యం పెరిగింది. టాలీవుడ్ సినిమాలు ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా బ్రాండ్ తోనే తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలు 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. అయితే కోలీవుడ్ లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి కూడా పడలేదు. గత ఏడాది జైలర్ సినిమా 600 కోట్ల దగ్గరకి వచ్చి ఆగిపోయింది. సూర్య కంగువ మూవీ కోలీవుడ్ లో 1000 కోట్లు కలెక్ట్ చేసే మొట్టమొదటి చిత్రం అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఈ సినిమా విజువల్ క్వాలిటీ హై స్టాండర్డ్స్ లో ఉండటం కోసం వరల్డ్ బెస్ట్ అలెక్సా సూపర్ 35, అలెక్సా ఎల్ఎఫ్ కెమెరాలని ఉపయోగించారంట. అలాగే గ్రాండ్ స్కేల్ పై చిత్రాన్ని ఆవిష్కరించారంట. ప్రపంచ వ్యాప్తంగా 38 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంగ్లీష్ వెర్షన్ ని ఇతర దేశాలలో బెస్ట్ క్వాలిటీతో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. ఇవన్నీ కూడా సినిమా రేంజ్ ని పెంచడంతో పాటు వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ ని కంగువ సినిమాకి తీసుకొస్తాయని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది.

Tags:    

Similar News