కన్నప్ప.. విల్లు ఎక్కుపెట్టిన మంచు విష్ణు!

పీరియాడిక్ మైథలాజికల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Update: 2024-03-08 10:45 GMT

టాలీవుడ్ హీరో మంచు విష్ణు లీడ్ రోల్ లో కన్నప్ప చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. పరమశివుని భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. పీరియాడిక్ మైథలాజికల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనే జరుగుతోంది.


న్యూజిలాండ్ లోని బ్యూటీఫుల్ లొకేషన్లలో కన్నప్ప సినిమాను షూట్ చేశారు మేకర్స్. అందుకోసం 600 మంది హాలీవుడ్ ప్రముఖులు పనిచేశారు. ప్రస్తుతం మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు తదితరులు అక్కడే ఉన్నారు. ఇక రెండో షెడ్యూల్ కోసం అతి త్వరలో ఇండియా వస్తున్నట్లు ఇటీవల మంచు మోహన్ బాబు తెలిపారు. అయితే మంచు ఫ్యామిలీకి చెందిన మూడు జెనరేషన్లతో కన్నప్ప చిత్రం తెరకెక్కుతుండడం విశేషం.

సినీ ప్రియుల్లో ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. శివరాత్రి పండుగ కానుకగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను శుక్రవారం రిలీజ్ చేశారు. "గొప్ప శివ భక్తుడు కన్నప్పగా నటించడం గౌరవంగా భావిస్తున్నా. ఈరోజు మహా శివరాత్రి.. ఇదిగో మీ కన్నప్ప.. హరహర మహదేవ్" అంటూ పోస్ట్ చేశారు మంచు విష్ణు. ఆరు భాషలకు సంబంధించిన పోస్టర్లను రివీల్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ తెగ చక్కర్లు కొడుతోంది.

ఇప్పటి వరకు కన్నప్ప అనగానే మనమంతా ఆటవికుడిగా, కోయ వ్యక్తిగా చూశాం. కానీ కన్నప్ప మేకర్స్.. ఇప్పుడు ఓ వారియర్ గా చూపించారు. శారీరక ధారుడ్యం, సూటిగా చూస్తూ విల్లును ఎక్కు పెట్టిన వీరుడిగా మంచు విష్ణు కనిపిస్తున్నారు. జలపాతాల్లో నుంచి గురి పెట్టిన వేటగాడిగా ఉన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. సినీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.

ఇక.. ఈ మూవీని భారీ బడ్జెట్‌ తోపాటు హై టెక్నాలజీ తో మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా ప్రీతి ముఖుంధన్ నటిస్తున్నారు. ప్రభాస్‌- నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. స్టార్ నటులు మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టీఫెన్‌ దేవస్సే, మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంతోనే మంచు వారసుడు అవ్రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఈ మూవీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News